బెజవాడ దుర్గమ్మకు కొడాలి నాని పూజలు-జగన్ కోసం ఏం కోరుకున్నారో తెలుసా ?

ఏపీలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చేవి ఆయన చంద్రబాబుు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను తిట్టే తిట్లే. అలాంటి నాని ఈ మధ్య కాస్త సైలెంట్ అయినట్లు కనిపిస్తున్నారు. అదే సమయంలో కొడాలి అనారోగ్యానికి గురైనట్లు కూడా ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదని కొడాలి క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్నట్లుండి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొడాలి దర్శనమిచ్చారు. అదీ కుటుంబ సమేతంగా.

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని దంపతులకు ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు సాదరంగా ఆహ్వానం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని దంపతులకు... వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

kodali nani visits vijayawada kanaka durga temple with family, prays to bless ys jagans family

కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాన్ని కొడాలి నానికి అందజేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో యావత్ ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని అమ్మవారిని ప్రార్థించారు. పేదల కోసం కష్టపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూడాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి గుడివాడ నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్న కొడాలి నాని ప్రత్యర్ధులకు గట్టి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు గుడివాడ నుంచి రెండు పార్టీల తరఫున గెలిచిన నానిని ఓడించేందుకు ప్రత్యర్ధులు ఇప్పటి నుంచే అభ్యర్ధుల వేటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడాలి వర్సెస్ ప్రత్యర్ధులుగా మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా కొడాలిపై పోటీ చేసే టీడీపీ అభ్యర్ధిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+