Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మార్చి 17న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే

ఏడు కొండలపైన కొలువైన, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతీ నెలా విశేష పూజలు జరుగుతాయనే విషయం తెలిసిందే . మార్చి 17న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించాలని పేర్కొంది.

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 17వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ప్రతీ సంవత్సరం తిరుమలలో కొనసాగుతున్న ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.

koil-alwar-thirumanjanam-at-tirumala-on-march-17-vip-break-darshan-cancelled-ttd-alert-to-devotees

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అని టీటీడీ పేర్కొంది. అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.

శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్

ఇదిలా ఉంటె నేడు శ్రీవారి ఆలయంతో పాటు పద్మావతి అతిథి గృహంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. మొదట రాంభగీచ అతిథి గృహం ఎదురుగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్, ఫైర్ ఆలయ సిబ్బంది ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు. మొత్తం 160 మంది ఎస్ఎస్ జీ గార్డ్స్, 30 మంది అధికారులు మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+