కారం కొట్టి సాంబశివుడు సోదరుడి హత్య, నయీం పైనే..
నల్గొండ: మాజీ మావోయిస్టు నేత సాంబశివుడు సోదరుడు కోనాపురి రాములు హత్యకు గురయ్యారు. నల్లొండ జిల్లా శివారులోని ఓ ఫంక్షన్ హాలులో రాములు హత్యకు గురయ్యారు. కోనాపురి రాములు ఓ ఫంక్షన్ హాలు నుండి బయటకు వస్తుండగా పదిమంది గుంపుగా వచ్చి అతని కళ్లలో కారం కొట్టి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు. అతని పైన కాల్పులు జరిపిన దండగులు అక్కడి నుండి వెంటనే పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తనకు ప్రాణహానీ ఉందని కోనాపురి రాములు గతంలోనే మొరపెట్టుకున్నారు. అతనికి ఇద్దరు గన్‌మెన్లను ఏర్పాటు చేశారు. వారి సమక్షంలోనే దుండగులు అతనిని హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలంలో ఐదు తూటాలను స్వాధీనం చేసుకున్నారు. బంధువుల పెళ్లికి వచ్చిన రాములుపై వారు దాడికి పాల్పడ్డారు.
తెరాస నేత, మావోయిస్టు మాజీ నేత కోనాపురి రాములును హత్య చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. కోనాపురి రాములు హత్యను ఖండిస్తున్నానని తెలిపారు.
నయీం ముఠాపై అనుమానం
కోనాపురి రాములు హత్య వెనుక నయీం ముఠా హస్తముందనే ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను పంపినట్టు చెప్పారు. ప్రజలు సహకరిస్తే వారిని పట్టుకుంటామన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేసినట్లు తెలిపారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications