వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదుపులోకి వచ్చిన కోనసీమ -రౌడీషీటర్ల నిర్బంధం-ఇంటర్నెట్ బంద్-డీజీపీ వెల్లడి

|
Google Oneindia TeluguNews

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నిన్న కోనసీమ సాధన సమితి చేసిన ఆందోళనలు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. భారీ ఎత్తున మిగతా జిల్లాల నుంచి తరలివచ్చిన పోలీసులు అన్ని ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అల్లర్లు సద్దుమణిగాయి. 144 సెక్షన్ ను పూర్తిస్ధాయిలో అమలు చేస్తున్నారు.

కోనసీమలో పరిస్ధితిపై ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కలెక్టరేట్‌, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

konaseema situation under control, internet block, rowdysheeters detained-dgp rajendranath

జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

కోనసీమ జిల్లాలో పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరా తీశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ, ఎస్పీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితిని డీఐజీ, ఎస్సీలు సమీక్షిస్తున్నారు. అమలాపురం ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్‌ చేశామని డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు.

కోనసీమ ఘటనల్నిక్షేత్రస్ధాయిలో పర్యవేక్షిస్తున్న డీఐజీ పాలరాజు .. కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. అమలాపురం అల్లర్లపై ఏడు కేసులు నమోదు చేశామన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీఐజీ పాలరాజు వెల్లడించారు.

English summary
ap dgp rajendranath reddy on today said that the situation in konaseema district is now under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X