Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోట వినుత డ్రైవర్ హత్య వెనుక బెడ్ రూమ్ వీడియోలు ? బొజ్జలకు ఉచ్చు బిగుస్తోందా ?

ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళా నేత కోట వినుత మాజీ డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా తమిళనాడు పోలీసులు ఆమెతో పాటు భర్త చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. దీంతో జనసేన పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేశారు. అయితే ఈ కేసులో కోట వినుత ప్రైవేటు వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. డ్రైవర్ హత్య వెనుక ఈ వీడియోలే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసు వెనుక గతేడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చోటు చేసుకున్న పరిణామాలు కీలక పాత్ర పోషించినట్లు తమిళనాడు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత ఎన్నికలకు ముందు కోట వినుత బెడ్ రూమ్ లో ప్రైవేట్ గా ఉన్న వీడియోల్ని సీక్రెట్ కెమెరా పెట్టి డ్రైవర్ రాయుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోల్లో కొన్నింటిని అతను లీక్ చేయడంతో సమస్య మొదలైంది.

kota vinutha s bedroom videos behind driver s murder tdp mla bojja sudhir reddy s under scanner

గత ఎన్నికల సమయంలోనే ఈ వీడియోలు బయటికి రావడం వల్లే కోట వినుతను కాదని శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డిని కూటమి నిలబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో కోట వినుత స్ధానంలో బొజ్జల సుధీర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఒకరోజు ఈ వీడియోల వ్యవహారం బయటపడింది. ఈ వీడియోల లీక్ వ్యవహారం తెలిసి డ్రైవర్ రాయుడిపై కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది.

kota vinutha s bedroom videos behind driver s murder tdp mla bojja sudhir reddy s under scanner

నేరుగా డ్రైవర్ ను ప్రశ్నిస్తే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడనే ఇలా కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించినట్లు చెప్పేశాడు. ఆరా తీస్తే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడికి డబ్బులిచ్చి ఇలా వీడియోలు తీయించి లీక్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి డ్రైవర్ రాయుడిని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు చిత్రహింసలు పెట్టినట్లు కోట వినుత దంపతులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. అయితే తాము అతన్ని చంపలేదని విచారణలో కోట వినుత దంపతులు చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు బొజ్జలపై పోలీసులు ఇప్పటివరకూ నేరుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+