Viral Video: రిపబ్లిక్ డే వేళ భార్యతో కలెక్టర్ గారి మాస్ స్టెప్పులు చూశారా ?

దేశవ్యాప్తంగా నిన్న గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో ఓ జిల్లా కలెక్టర్ తన భార్యతో కలిసి డ్యాన్సులు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అంతా చూస్తుండగానే వేదికపై కలెక్టర్ గారు స్టెప్పులు వేశారు.ఇవి ఏ స్ధాయిలో ఉన్నాయంటే అధికారులు, సిబ్బంది విజిల్స్ వేసి మరీ వీరిద్దరినీ ప్రోత్సహించారు.

నిన్న రిపబ్లిక్ డే వేడుకల్లో ఉదయం పాల్గొన్న కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.. సాయంత్రం తన బంగ్లాలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మీడియాను ఆహ్వానించలేదు. కేవలం అధికారులు,సిబ్బందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. దీంతో వారు మాత్రమే దీనికి హాజరయ్యారు. ఇందులో కలెక్టర్ బాలాజీ తన సతీమణితో కలిసి తెలుగు సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ హంగామా చేశారు. దీంతో ఈవెంట్ కు హాజరైన అధికారులు, సిబ్బంది విజిల్స్ వేసి ఉత్సాహ పరిచారు.

krishna district collector dk Balaji dance with wife on republic day at home event

కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో డ్యాన్సులు వేయడం సహజమే అయినా ఇలా ఎట్ హోమ్ వంటి అధికారిక కార్యక్రమంలో, అదీ రిపబ్లిక్ డే రోజు ఇలా కలెక్టర్ బహిరంగంగా భార్యతో కలిసి డ్యాన్సులు వేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. దేశభక్తి ఉప్పొంగాల్సిన రోజు.. కలెక్టర్ గారు మాత్రం ఉదయం దేశ భక్తి సేవలో తరించి.. సాయంత్రం డ్యూయెట్ సాంగ్స్ కు డ్యాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+