కృష్ణాజిల్లా మొగ్గు ఎటు ? తాజా సర్వే.. గుడివాడలో సీన్ రివర్స్..!
ఏపీలో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ పార్టీలు హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీయే కూటమి పార్టీల మధ్య చాలా సీట్లలో ముఖాముఖీ పోరు నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందన్న దానిపై పలు సర్వేలు వెలువడుతున్నాయి. ఇందులో కొన్ని వైసీపీవైపు మొగ్గు చూపుతుండగా.. మరికొన్ని ఎన్డీయే కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ సెఫాలజిస్టు పార్ధాదాస్ కృష్ణాజిల్లాపై చేసిన సర్వే ఫలితాలు వెల్లడించారు.
పార్ధా దాస్ అంచనాల ప్రకారం ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న అసెంబ్లీ సీట్లలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదు. అయితే ఇందులో వైసీపీకి మెజార్టీ స్ధానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే విజయవాడలో పూర్తిగా వైసీపీ హవా కనిపిస్తోందని ఈ సర్వేలో తేల్చారు. మిగతా ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీకి దాదాపుగా సగం సగం సీట్లలో ఆధిక్యం ఉన్నట్లు తేల్చారు.

#APElections2024 :
— Partha Das (@partha2019LS) April 5, 2024
Survey results for #Krishna district:
TDP alliance is leading in 6-7 seats.
YSRCP is leading in 9-10 seats.
Overall Vote Share :
YSRCP - 50.5%
TDP alliance - 47.6%
Among Male Voters:
YSRCP - 49.1%…
ఈ సర్వే ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 16 అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 9-10 సీట్లు లభించే అవకాశం ఉన్నట్లు తేల్చారు. అలాగే టీడీపీకి 6-7 సీట్లు లభించే అవకాశాలున్నాయి. విజయవాడలోని మూడు సిటీ సీట్లలో వైసీపీకే మొగ్గు కనిపిస్తోంది.
At Nuzvid, potential independent candidate is spoiling the chance of TDP.
— Partha Das (@partha2019LS) April 5, 2024
At Gudivada, TDP is leading as per our survey. (Many may not agree)
Among Muslim community voters, YSRCP is polling 70.8%, whereas TDP alliance is polling 26.2% in Krishna district.
YSRCP is leading in all…
నూజివీడులో ఇండిపెండెంట్ అభ్యర్ధి కారణంగా టీడీపీ అభ్యర్ధి విజయావకాశాలపై ప్రభావం పడుతుందని తేల్చారు. అలాగే కొడాలి నాని కంచుకోట అయిన గుడివాడలో మాత్రం ఈసారి టీడీపీ గెలవబోతున్నట్లు తేల్చారు. జిల్లాలోని ముస్లిం ఓటర్లలో 70 శాతం పైగా వైసీపీకే మొగ్గు చూపుతున్నారని, కేవలం 26 శాతమే టీడీపీవైపు ఉన్నట్లు కూడా తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications