వకీల్‌సాబ్‌కు కృష్ణాజిల్లాలో షాక్- రేట్లు పెంచితే చర్యలే-అధికారుల వార్నింగ్
పవన్ కళ్యాణ్ నటించిన రీమేక్ మూవీ వకీల్ సాబ్ విడుదల సందర్భంగా రేట్ల పెంపుకు సిద్ధమవుతున్న ధియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లకు కృష్ణాజిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. చిత్రం విడుదల సందర్భంగా ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం కృష్ణాజిల్లాలోని సినిమా థియేటర్లలో కొత్త చిత్రాల విడుదల సందర్భంగా ప్రీమియర్ షోలు, రెగ్యులర్ షోలకు సినిమా టికెట్ల రేట్లు పెంచడానికి ఎలాంటి అనుమతులు జారీ చేయలని జాయింట్ కలెక్టర్ మాధవీలత ప్రకటించారు. ఈ నెల 9న వకీల్ సాబ్ చిత్రం విడుదల సందర్భంగా థియేటర్లలో టికెట్ల రేట్లు పెంచుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు ఆమె పేర్కొన్నారు.రేట్ల పెంపుకు తాము అనుమతులు ఇచ్చినట్లు జరుగుతున్నది అసత్య ప్రచారమని ఆమె తెలిపారు.

వకీల్ సాబ్ విడుదల సందర్భంగా రేట్లు పెంచి అమ్మితే కఠిన చర్యలు తప్పవని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మాథవీలత జిల్లాలోని థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించారు. ఎక్కడైనా రేట్లు పెంచి టికెట్లు అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో కరోనా తర్వాత విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ చిత్రాన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన పలు థియేటర్ల యాజమాన్యాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.












Click it and Unblock the Notifications