బాబు లక్ష్యంగా ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం : మోదీ ఇగో కోసమే వెనక్కు తగ్గాం : కెటిఆర్ సంచలనం
తెలంగాణ తాజా మాజీ మంత్రి కెటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాసంబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు అవసరమైతే ఏపి రాజకీయాల్లోనూ వేలు పెడతామని ప్రకటించారు. చంద్రబాబు అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని విమర్శించారు. రాజకీయంగా చంద్ర బాబు సంగతి తేలుస్తామని..ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక, మోదీ ఇగో కోసమే కెసిఆర్ ఆనాడు వెనక్కు తగ్గారని వివరించారు.
కెసిఆర్ తనయుడు కెటిర్..ఏపి ముఖ్యమంత్రి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేసారు. హమారా హైదరాబాద్ కార్యక్రమం లో ఆయన చంద్రబాబు లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేం దుకు అవసరమైతే ఏపిలోనూ వేలు పెడతామని కెటిఆర్ ప్రకటించారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరం గా వేలు పెట్టారన్నారు. సైబరాబాద్ లో నాలుగు బిల్డింగులు కట్టిన చంద్రబాబే అంత ఫోజు కొడితే..అసాధ్యమనుకున్న తెలంగానను తెచ్చిన కెసిఆర్ కు ఎంతుండాలని కెటిఆర్ ప్రశ్నించారు. తాము కూడా ఏపి రాజకీయాల్లో వేలు పెడతామని స్పష్టం చేసారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామని. ఆ దిశగా భవిష్యత్ లో రాజకీయంగా నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు.

చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారం లో తాను ఏం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. నువ్వు తప్పు చేయలేదా..? నువ్వు సుద్దపూసవా..? అంటూ ఓటు కు నోటు కేసు విషయాన్ని ప్రస్తావించారు. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినికి ఎందుకు సీటిచ్చారు. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది...అంటూ ఎద్దేవా చేసారు. ఇక, అమరావతి శంఖుస్థాపన సమయంలో ఏపి ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్లిన కెసిఆర్ కు ఇతర నాయకుల కంటే భారీ స్థాయిలో జనం నుండి అభిమానం దక్కిందని గుర్తు చేసారు.. ఇక, అదే వేదిక ద్వారా ఏపి నూతన రాజధాని కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున వంద కోట్లు ఇవ్వాలని నిర్ణయించామ ని..అయితే, వేదిక పై ఉన్న ప్రధాని అమరావతికి ఆర్దికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవటంతో..ఆయన ఇగో దెబ్బ తిన కూడదనే ఉద్దేశంతో కెసిఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని కెటిఆర్ వివరించారు.












Click it and Unblock the Notifications