Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాకినాడలో రాజకీయ కలకలం, జనసేనలో అంతర్గత అసంతృప్తి

సంక్రాంతికి వేళ కాకినాడ రాజకీయంలో కలకలం రేగింది. ఒక పదవి కోసం జరుగుతున్న రాజకీయ చదరంగంలో అనుకోకుండా ఇరుక్కున్నారు ఓ మంత్రి. అసలే అధినాయకుడు పవర్‌ఫుల్, అందులోని నమ్మి చేతిలో పెట్టిన మంత్రి పదవి. పదవికి భంగం వాటిల్లకుండా పని చేసుకుంటూ పోతున్న ఆయనకు తిప్పలు తెచ్చిపెట్టారు పక్కన తిరిగే ఓ నేత. కట్ చేస్తే మంత్రి పేరుతో చేసిన దందా మొత్తం బయట పడింది. ఈ వ్యవహారం మొత్తానికి మంత్రికి సంబంధం లేకున్నా.. ఆ జిల్లాలో పార్టీ పరంగా జరగాల్సిన డ్యామేజ్ అంత జరిగిపోయింది అని టాక్..

కాకినాడ జిల్లా రాజకీయాల్లో మరోసారి కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి (KUDA) చైర్మన్ పదవి చుట్టూ తిరుగుతుంది. బయటకు ఇది ఓ ఛైర్మన్ పదవి కోసం జరుగుతున్న చదరంగంలా ఉన్నా.. లోతుగా చూస్తే... పార్టీ నియమాలు పూర్తిగా తుంగలో తొక్కి, మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పన్నుతున్న వ్యూహంలా కనిపిస్తుంది. కాకినాడ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు తలాటం సత్య. మంత్రి కందుల దుర్గేష్‌కు అత్యంత సన్నిహితుడినని ప్రచారం చేసుకుంటూ, కాకినాడలో రాజకీయాల్లో బాగానే చక్రం తిప్పుతున్నాడని టాక్ ఒక్కసారిగా గుప్పుమంది. సొంత పార్టీ నేతలే సత్యం తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. "మంత్రి పేరు వాడుకుని వ్యవహారాలు నడుపుతున్నారు అన్న ప్రచారం ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తోంది. అయితే ఇదంతా మంత్రికి తేలిసే జరుగుతుందా ? అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

KUDA Chairman Race Heats Up in Kakinada Jana Sena Faces Internal Dissent Over Alleged Power Lobbying

సెటిల్మెంట్ల ఆరోపణలు - పార్టీకి మచ్చ పడుతోందా?

గత దీపావళి సందర్భంగా బాణసంచా షాపుల కేటాయింపులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ల నిర్వహణ వంటి అంశాల్లో తలాటం సత్య పేరు వినిపించడమే కాకుండా, బినామీల ద్వారా లాభాలు ఆర్జించారన్న విమర్శలు రావడం ఈ వివాదాన్ని మరింత ముదిరింది. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్న దానికంటే, పార్టీ ప్రతిష్ఠకు దెబ్బ తగులుతోందన్న భావన జనసేన క్యాడర్‌లో బలంగా వ్యక్తమవుతోంది. వ్యక్తిగత లాభాల కోసం పార్టీ పేరును, మంత్రి పేరును వాడుకుంటే చివరకు నష్టపోయేది పార్టీనే అన్న అభిప్రాయం సీనియర్ నేతల నుంచి వినిపిస్తోంది.

కష్టకాలంలో పనిచేసినవారికి అన్యాయమా?

ఈ వివాదాన్ని తారా స్థాయికి తీసుకుపోయింది అసలైన క్యాడర్ అసంతృప్తి. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నేతలకు గడ్డుకాలం నడుస్తున్న నేపథ్యంలో కొందరు నేతలు ఇలా మంత్రి పేరు వాడుకుంటూ బాగా సంపాదిస్తున్నారని మండిపోతున్నారు జనసైనికులు. పైరవీలు చేసినంత మాత్రాన పదవులు ఇస్తే, పార్టీ కోసం రోడ్ల మీద పోరాడిన క్యాడర్ పరిస్థితి ఏమవుతుంది? అన్న ప్రశ్న జగ్గంపేట, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల నుంచి బహిరంగంగానే వస్తోంది. ఇలాంటి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో తప్పుడు సంకేతాలు పంపుతాయని, దీని ప్రభావం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పడి పార్టీకి నష్టంగా మారుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

పార్టీ నిబంధనలు vs వ్యక్తిగత ఆశలు

ఒకే నియోజకవర్గం, ఒకే సామాజిక వర్గం నుంచి ఒకరికి మించి కీలక పదవులు ఇవ్వకూడదన్న టాక్ బాగా వినిపిస్తుంది జనసేనలో. ఇప్పటికే కాకినాడ సిటీకి చెందిన, కాపు సామాజిక వర్గానికి చెందిన తోట సుధీర్.. సివిల్ సప్లై చైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో, అదే ప్రాంతం నుంచి మరోసారి అదే వర్గానికి చెందిన వ్యక్తిని కుడా చైర్మన్ ఇవ్వడం రాజకీయంగా సరైంది కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో ఇలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన తుమ్మల బాబుకు కుడా చైర్మన్ పదవి ఇచ్చారన్న ఉదాహరణను ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు.

ఒకవేళ కాపు సామాజిక వర్గానికే ఈ పదవి ఇవ్వాల్సి వస్తే సత్యకు కాకుండా.. తుమ్మలపల్లి రమేష్ (జగ్గంపేట), కత్తిపూడి బాబీ (ప్రత్తిపాడు), ఓదూరి నాగేశ్వరరావు (పిఠాపురం) వంటి సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వడం వల్ల ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలపడుతుందన్న అభిప్రాయం కార్యకర్తల నుంచి వినిపిస్తోంది.

ఈ మొత్తం పరిణామాన్ని చూస్తే, ఇది కేవలం ఒక పదవి కోసం జరుగుతున్న పోటీ కాదు. పార్టీ నైతికత, క్యాడర్‌కు ఇచ్చే విలువ, మంత్రి ప్రతిష్ఠ, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు అన్నింటిని బేరిజు వేసుకుని అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆలస్యం చేస్తే మంత్రితో పాటు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా బహిరంగంగానే జరుగుతుంది. ఇలా మంత్రి పేరు వాడుకుంటూ.. నిజంగా పైరవీలు చేస్తున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటేనే పార్టీకి మంచి పేరు రావడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి చూపిన వారిమవుతామంటున్నారు పలువురు జనసేన నేతలు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+