కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఇవాళ ఆత్మహత్యాయత్నం చేశారు. ఫ్యాన్ కు ఉరేసుకున్న ఆయన్ను స్దానికులు కాపాడారు. రాజకీయంగా తలెత్తిన ఇబ్బందులే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కర్నూలు మాజీ మేయర్ - బంగి అనంతయ్య
కర్నూలు మాజీ మేయర్ , తెలుగు దేశం సీనియర్ నేత బంగి ఆనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. భార్య, కూతురును కూరగాయల కోసం మార్కెట్ కు పంపి ఇంట్లో ఉరేసుకునేందుకు ప్రయత్నించారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన బంగి అనంతయ్యను స్థానికులు గమనించి వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అంతరం ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Kurnool Former Mayor Bangi Anantiah attemps Suicide

రాజకీయంగా టీడీపీ మోసం చేసిందనే ?
రాజకీయంగా తనను అందరూ మోసం చేశారనే ఆవేదనతోనే బంగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ లో దశాబ్దాలుగా బంగి ఆనంతయ్య కీలక పాత్ర పోషించారు. విచిత్ర వేషధారణలతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అనంతయ్య ఆత్మహత్యాయత్నం చేశారని తెలిసి తెలుగుదేశం శ్రేణులు షాక్ కు గురయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు బంగి అనంతయ్య ఆత్మహత్య ప్రయత్నానికి దారి తీసిన కారణాలను వాకబు చేశారు.

English summary
Former Mayor of Kurnool and TDP Senior Leader Bangi Anantiah attmpted sucide today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X