ఇలాగేనా?: నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు(వీడియో)

Subscribe to Oneindia Telugu

కర్నూలు: ఎంతో క్రమశిక్షణగా ఉండాల్సిన భద్రతా విభాగంలో పనిచేస్తున్న పోలీసులు నడిరోడ్డుపై కొట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు ప్రధాన పట్టణంలోని రాజ్ విహార్ సర్కిల్ లో హుస్సేన్ అనే హోం గార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఇంతలో ఆ దారిలో మనోజ్ కుమార్, మణి కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో వాహనాలన్నీ వెళ్తున్నా.. వారు వెళ్లడం లేదు. దీంతో హుస్సేన్ వారి వద్దకు చేరుకుని, రద్దీగా ఉండే రోడ్డులో వాహనం ఆపితే ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని వెళ్లిపోవాలని కోరాడు.

దీంతో వెళ్లకపోతే ఏం చేస్తావంటూ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ హుస్సేన్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో వారి వాహనం తాళం స్వాధీనం చేసుకునేందుకు హుస్సేన్ ప్రయత్నించడంతో ఆగ్రహానికి గురైన మనోజ్ కుమార్ అతనిపై దాడికి దిగాడు. దీంతో హుస్సేన్ ఎదురుదాడి చేశాడు.

ఇద్దరూ నడిరోడ్డుపై కాసేపు కొట్టుకున్నారు. మరో వ్యక్తి కలగజేసుకుని వారిద్దర్నీ వారించాడు. కగా, దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన ఎస్పీ.. హోంగార్డుపై దాడికి పాల్పడిన మనోజ్ కుమార్, మణికుమార్‌ను సస్పెండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two Kurnool police were fighting on a road when heavy traffic.
Please Wait while comments are loading...