'ఆంధ్రా కాశ్మీర్'.. లంబసింగి అందాలు.. ఎలా వెళ్లాలి..?

కాశ్మీర్ అందాలు చూడాలంటే కాశ్మీర్ వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రా కాశ్మీర్ గా పేరు గాంచిన లంబసింగి అందాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. చలికాలంలో ఈ ప్రదేశం ప్రకృతి రమణీయంగా కాశ్మీర్ అందాలను మైమరిపిస్తుంది. ఇక్కడ సహజమైన అందాలు పర్యటకులను అబ్బురపరుస్తాయి. సెలవుల్లో, వీకెండ్స్ లో ఈ ప్రాంతాలలో పర్యటిస్తే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. ఇక్కడి అందమైన పర్వతాలు, పచ్చని అడవులు.. ముగ్ధమనోహర లోయలు.. గలగలలాడే సెలయేటి పరవళ్లు పర్యటకుల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.

ఇక్కడ ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలు.. మైనస్ వన్ డిగ్రీలు కంటే తక్కువగా నమోదవుతాయి. ఇక్కడి పర్వతాలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. లంబసింగి ప్రాంతం సముద్రమట్టానికి 4 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ముఖ్యంగా లంబసింగిలో చెరువులవేనం అనే ప్రాంతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని చూసేందుకు పర్యటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలు ఎక్కాలి. ట్రెక్కింగ్ ఇష్టపడేవారికి ఇది ఓ థ్రిల్లింగ్ జర్నీగా ఉంటుంది. చెరువులవేనం అందాలను చూడాలంటే ఉదయాన్నే ఇక్కడికి చేరుకోవడం ఉత్తమం. ఇక్కడి పచ్చని కొండలు, అడవులు ప్రకృతి రమణీయంగా ఉంటాయి.

ఇక లంబసింగి ప్రాతంలో మరో చూడదగ్గ ప్రాంతం కొత్తపల్లి వాటర్ ​ఫాల్స్​.. ఈ జలపాతం లంబసింగి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓ వైపు మంచు కురుస్తున్న వేళలో మరోవైపు జలపాతం సవ్వడులు చూపరులను చూపు తిప్పుకోనీవ్వకుండా ఉంటాయి. కొత్తపల్లి జలపాతంపై నుంచి కిందికి మెట్ల మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ వద్ద ట్రెక్కింగ్, స్విమ్మింగ్ వంటి అడ్వెంచర్స్​ కూడా ఉన్నాయి. ఇక లంబసింగి ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంది. జలాశయానికి వెళ్లేటప్పుడు అక్కడక్కడా కనిపించే గిరిజనుల గుడిసెలు, రోడ్డుకు రెండు వైపులా పచ్చని చెట్లు, పూలు కొత్త ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ జలాశయంలో పర్యాటకుల కోసం బోటింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.

Lambasinghi Tourist Spot Complete Guide to Andhra Kashmir s Stunning Landscapes

అలాగే ఇక్కడి వలిసె పూల తోటలు మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక లంబసింగి ప్రాంతం చేరుకోవాలంటే విశాఖపట్నానికి చేరుకుని అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి ప్రాంతానికి కారు లేదా బైక్ మీద చేరుకోవచ్చు. ఇక నర్సిపట్నం ప్రాంతం నుంచి లంబసింగి దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి అయితే ముందుకు విశాఖపట్నం రైలు, బస్సు లేదా విమానం ద్వారా చేరుకుని అక్కడి నుంచి లంబసింగికి చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+