పెళ్ళికి ముందే వరుణ్ తేజ్ కు లావణ్య త్రిపాఠి కండీషన్!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈ జంట కుటుంబసభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ సంవత్సరం చివరలో వీరి వివాహం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరి పెళ్లి ఎక్కడ జరుగుతుంది? పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లి కార్డు ఖరీదు ఎంత? వంటి అంశాలపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్ళికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ కు ఒప్పుకున్న తర్వాతనే పెళ్లికి ఒప్పుకుందని ఒక వార్త వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ కండిషన్ ఏమిటంటే లావణ్య త్రిపాఠికి భరత నాట్యం అంటే చాలా ఇష్టం. అయితే పెళ్లయిన తర్వాత కూడా తనకు ఏదైనా వేదికపై భరతనాట్యం చేసే అవకాశం వస్తే దానికి అడ్డు చెప్పొద్దని, భరత నాట్యం చేసే ఛాన్స్ తాను వదులుకోలేనని చెప్పిందట. ఇక డాన్స్ విషయంలో తనకు కండిషన్లు పెట్టకూడదని ఆమె కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాదు పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఇంకా సినిమాలలో నటించబోనని, కానీ ప్రొడక్షన్ వైపు వెళ్తానని చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో మెగా ఫ్యామిలీతో కూడా లావణ్య త్రిపాఠి మాట తీసుకుందని సమాచారం. అంతేకాదు మెగాఫ్యామిలీ పరువుపోయే పని తాను చేయనని లావణ్య త్రిపాఠి చెప్పినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మాతగా మారతానని చెప్పి లావణ్య త్రిపాఠి, పెళ్లి తర్వాత నటిగా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం.

ఇక ఈ కండిషన్స్ అన్నిటికీ వరుణ్ తేజ్ ఒప్పుకున్న తర్వాతనే లావణ్య త్రిపాఠి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక మెగా ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీ కుటుంబ పరువు నేపథ్యంలో కొన్ని కండిషన్స్ పెట్టారని సమాచారం. ఇక వీరిద్దరి పెళ్లి డిసెంబర్లో జరుగనుందని ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.
వీరి జాతకం ప్రకారం ఇటలీలో పెళ్లి జరిగితే వారి సంసారం సాఫీగా సాగుతుందని పండితుడు చెప్పినట్టుగా కూడా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అన్నది ఆసక్తిగా మారింది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications