ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ వార్నింగ్: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఆళ్లగడ్డ వదిలి వెళ్లాలంటూ ఏవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. అంతేగాక, ఈ మేరకు పోలీసులతో సుబ్బారెడ్డిపై ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది. అయితే, తాను ఎక్కడికీ వెళ్లేది లేదని ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెబుతున్నారు. ఇరువర్గాల నేతల మాటల యుద్ధం నేపథ్యంలో ఆళ్లగడ్డలో భారీగా పోలీసులు మోహరించారు.
కాగా, ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఎవరో చెబితే తాను ఎందుకు వెళ్తానని.. ఏం జరిగినా తేల్చుకుంటానని ఏవీ సుబ్బారెడ్డి తేల్చి చెబుతున్నారు. నేతల పరస్పరం ప్రకటనలు, భారీగా పోలీసులు మోహిరించడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలావుండగా, రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో హల్చల్ చేశారు. డెయిరీ ప్రాంగణంలోని ఛైర్మన్ గదిలోకి వెళ్లి అక్కడి కుర్చీలో కూర్చున్నారు. డెయిరీలో ఏం జరుగుతుందో చెప్పాలని, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ విషయం తెలిసిన డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అఖిలప్రియకు ఫోన్ చేశారు. తాను లేని సమయంలో కార్యాలయానికి వచ్చి తన సీటులోనే కూర్చోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అఖిలప్రియ మరింత ఆగ్రహానికి గురయ్యారు. డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న నూతన శిలా ఫలకాల ఏర్పాటుపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందన్నారు.
తనతో ఏమైనా సమస్యలుంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవాలని ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి అఖిలప్రియ స్పష్టం చేశారు. 'నాతో మామగా మాట్లాడుతున్నావా..? లేక ఛైర్మన్‌గా మాట్లాడుతున్నావా? మామవైతే నీ సీట్లో కూర్చొంటే తప్పేముంది?' అని అఖిలప్రియ అన్నారు. అంతేగాక, మీ ఇష్టం వచ్చినట్లు డెయిరీ నిర్వహణ చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి అంటూ హెచ్చరించారు.
నాకు ఎందుకు ఫోన్ చేశావ్ అసలు. మీ సీట్లో కూర్చోవడం ఇబ్బందైతే అదే విషయాన్ని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసుకో అంటూ భూమా అఖిలప్రియ డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భూమా అఖిలప్రియ వ్యవహరించిన తీరు నంద్యాల జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications