3 ఏళ్లలో రూ.5 లక్షలకు రూ.12 లక్షలిచ్చిన స్టాక్
ప్రస్తుత కాలంలో పెట్టుబడి పెట్టేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో చూసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక కళ. సరైన మార్గాన్ని ఎంచుకోవాలనుకునేవారు ముందుగా నిపుణులను సంప్రదించాలి. రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండేవారైతే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టొచ్చు.
రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడినవారిని తక్కువ సమయంలోనే లక్షాధికారులుగా మార్చిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి. అయితే వాటిని ముందుగా గుర్తించి పెట్టుబడి పెట్టడంలోనే ఆధారపడివుంటుంది. అలా అయితేనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అలాంటి ఓ స్టాక్ మూడు సంవత్సరాల కాలంలో రెట్టింపు లాభాన్నిచ్చింది. అదే లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (Lincoln Pharmaceuticals Ltd).

లింకన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీ గుజరాత్‌లోని ఖాట్రాజ్ లో ఉంది. 2023-24 తొలి త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 10.5 శాతం పెరిగి రూ.136 కోట్లకు చేరాయి. ఆపరేటింగ్ ఫ్రాఫిట్ 23.5 శాతం పెరిగి రూ.21 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల్లో కంపెనీ నెట్ ప్రాఫిట్ 26.6 శాతం పెరిగి రూ.19 కోట్లకు చేరింది.

గత ఏడాది ఈ కంపెనీ హైరిటర్న్స్ అందించింది. పెట్టుబడిదారులకు 72 శాతం లాభాలు వచ్చాయి. మూడు సంత్సరాల కాలాన్ని పరిశీలిస్తే కంపెనీ షేరు 132 శాతం పెరిగింది. మూడేళ్ల క్రితం అందులో రూ.5 లక్షలు పెట్టినవారి విలువ రూ.11.66 లక్షలైంది. కంపెనీ ఆర్ఓసీఈ ప్రస్తుతం 21.8 శాతం, ఆర్ఓఈ 15.6 శాతంగా ఉంది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే ఒక శాతం పెరిగింది. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.498ని తాకింది.












Click it and Unblock the Notifications