ప్రీమియం బ్రాండ్లతో కొత్త కిక్కు - ధరల మార్పు, తాజా మార్గదర్శకాలు..!!

ఏపీలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకే షాపులు కేటాయించింది. కొత్త దుకాణాలకు మార్గదర్శకాలు ఖరారు చేసింది. బ్రాండెడ్ మద్యం ధరల విషయంలోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక.. క్వార్టర్ మందు రూ 99కే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు సమయాలను ప్రభుత్వం ప్రకటించింది.

కొత్త కిక్కు
ఏపీలో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మద్యం దుకాణాలు క్లోజ్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీకి అనుగుణంగా కొత్త దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల కాల పరిమితితో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లకు అనుగుణం గా నేటి నుంచి కొత్త మద్యం వ్యాపారం ప్రారంభమైంది. నేడు కేటాయించిన ప్రాంతాల్లో మద్యం వ్యాపారులు తాత్కాలికంగా తమ షాపులను ప్రారంభించనున్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో తమ షాపులను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

liquor outlets opens in all the districts Govt issues new guidelines

ధరల్లో మార్పులు
ధరల విషయంలోనూ ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. మద్యం అమ్మకాల పైన రెండు శాతం సెస్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ నిరోధానికి ఈ మొత్తాన్ని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేసింది. అదే విధంగా ఏదైనా ఐఎంఎఫ్ఎల్ బాటిల్ ఎమ్మార్పీ ధర రూ 150.50 గా ఉంటే..ఆ దానిని రూ 160 వసూలు చేయనున్నారు. ఈ మేరకు ప్రివిలేజ్ ఫీజు అదనంగా పెంచింది. క్వార్టర్ బాటిల్ ధర 90.50గా ఉంటే ఏపీఎఫ్ కలిపి దాని ధర 100 రూపాయలు అవుతుంది.

బ్రాండెడ్ మద్యం వచ్చేసింది
అయితే, క్వార్టర్ మద్యం ధర రూ 99 గా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో, రూ 100 ధరగా ఉంటే అందులో రూపాయిని మినహాయించి రూ 99కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక.. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల నిర్వహణ పైన స్థానికంగా అభ్యంతరాలు వస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం మద్యం అమ్మకాలు..ధరలు..నాణ్యత విషయంలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం ఉండకూదని తేల్చి చెప్పింది. అయిదేళ్లు తరువాత తిరిగి అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రావటంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+