లాక్ డౌన్ వేళ వంటింట్లో భర్తతో కలిసి బిర్యానీ తయారీలో పురంధరేశ్వరి .. వీడియో వైరల్

కరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి ఏపీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది . అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తుంది. నిత్యావసరాలకోసం తప్ప ఎవరూ బయటకి రాని పరిస్థితి ఉంది . ఇక రాజకీయ రంగంలో ప్రముఖులు, సినీ రంగ సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో సోషల్ మీడియా తామేం చేస్తున్నామో అందరికీ తెలిసేలా చెప్తున్నారు .

ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే బీజేపీ నేత మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధరేశ్వరి, తన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు తో కలిసి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పుడూ రాజకీయాల్లో, క్షేత్ర పర్యటనలలో బిజీగా ఉండే నందమూరి బాలకృష్ణ సోదరి పురంధరేశ్వరి బావ కలిసి వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి కలిసి వంటగదిలో పోటీ పడి మరీ రకరకాల నాన్ వెజ్ వెరైటీలు వండారు. బిర్యానీ తయారు చేశారు .

lock down effect...Purandareshwari making biryani with her husband ..Video is viral

ఇక వారు ఇద్దరూ పోటీ పడి మరీ వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు ఉలవచారు బిర్యానీ సినిమాలోని ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా పాటను బ్యాక్ గ్రౌండ్‌లో వాడారు. బిర్యానీ, నాటుకోడి పులుసు వండిన తర్వాత పురంధేశ్వరి, వెంకటేశ్వర రావు కలిసి కాసేపు మనవరాలిని ఆడించారు. ఇక వీరి లాక్ డౌన్ కాలక్షేపం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడూ రాజకీయాల్లో బిజీగా ఉండే వారిని కూడా ఇంటికి కట్టి పడేసింది కరోనా అని ఇలాంటి వీడియోలు చూస్తున్న నెటిజన్లు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+