లాక్ డౌన్ : చంద్రబాబుకు ,లోకేష్ కు ఆ పని చెయ్యాలని వర్మ సలహా .. ఇంకా ఏం చెప్పారంటే
రాంగోపాల్ వర్మ .. ఈ పేరు చెపితే చాలు కాంట్రవర్సీ ఏదో ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటి వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్స్ చేస్తున్నారు . దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న వేళ రాం గోపాల్ వర్మ చంద్రబాబుకు , నారా లోకేష్ కు ఒక సలహా ఇచ్చారు. ఇంటికే అంతా పరిమితం అయ్యారు కాబట్టి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా చూడాలని , దాని మీద తనకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని రాం గోపాల్ వర్మ కోరారు .

ఇంట్లోనే అన్నిటికీ వివిధ ఏరియాలుగా పేర్లు పెట్టి వర్మ ట్వీట్
ఇక అంతే కాదు కరోనా వైరస్ వ్యాప్తితో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ తాను చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నానని తనదైన స్టయిల్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "నగరంలోని చాలా ప్రాంతాల్లో నేను తిరుగుతున్నాను. కిచర్ పూర్, సోఫా చౌక్, బెడ్ రూమ్ నగర్, డైనింగ్ పేట, బాల్కనీ కార్నర్, ఫ్రిడ్జ్ స్ట్రీట్, బాత్ రూమ్ సర్కిల్, వాషింగ్ మెషీన్ నగర్, టెలివిజన్ స్టేషన్ అన్నీ తిరిగేస్తున్నాను" అంటూ ఆయన చమత్కారంగా ట్వీట్ చేశారు.తన ఇంటినే ఇన్ని ఏరియాలుగా విభజించి రాం గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ చాలా ఆసక్తికరంగా ఉంది .

చిరంజీవి అండ్ టీమ్ కరోనా సాంగ్ పై వర్మ సెటైర్లు
అంతే కాదు సంగీత దర్శకుడు కోటి, కరోనా వైరస్ పై యుద్ధం చేయాలంటూ స్వరపరచగా, చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్ తదితరులు నటించిన పాటను ఆయన రీ ట్వీట్ చేస్తూ తనదైన సెటైర్లు వేశారు . "ఈ మల్టీ స్టార్ సాంగ్ అద్భుతం, మైండ్ బ్లోయింగ్. కరోనా వైరస్ కూడా ఈ పాటను ఇష్టపడుతుంది. నేను నా కరోనా స్పెషల్ సాంగ్ ను ఏప్రిల్ ఫూల్ డే రోజున విడుదల చేస్తున్నాను. ఇక ఎవరు ఫూల్ అవుతారో వైరస్ డిసైడ్ చేస్తుంది" అని రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు అందర్నీ ఆలోచించేలా చేస్తుంది.
Recommended Video

కరోనా సమయంలో రాం గోపాల్ వర్మ ఆసక్తికరమైన పోస్టులు
కరోనా విషయంలో అవేర్ నెస్ కోసం పాటలు చెయ్యటం , డ్యాన్సులు చెయ్యటం వంటి అంశాలపై రాం గోపాల్ వర్మ చాలా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది కష్ట కాలం అని , సీరియస్ గా పని చెయ్యాల్సిన సమయం అని చెప్పకనే చెప్తున్నారు. ఇక మత ప్రబోధకులు ,తదితరులకు గట్టిగానే తన స్టైల్ లో చీవాట్లు పెడుతున్నారు. ఆసక్తికరమైన పోస్ట్ లు పెడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తేలా చేస్తున్నారు రాం గోపాల్ వర్మ .












Click it and Unblock the Notifications