యువగళం పాదయాత్ర 100వ రోజు; తల్లి భువనేశ్వరిపై లోకేష్ ఎమోషనల్ పోస్ట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల మద్దతును కూడగట్టడం కోసం నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర వందో రోజుకు చేరింది. నేడు 100వ రోజున లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు నేడు లోకేష్ పాదయాత్రలో పాల్గొని అటు లోకేష్ తో పాటు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
ఇక నేడు పాదయాత్ర గురించి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.. బుడిబుడి అడుగులు వేసేటప్పుడు తడబడకుండా పట్టుకున్న అమ్మ చెయ్యి..వడివడిగా అడుగులు వేసేటప్పుడు నడవడిక నేర్పిన తల్లి ప్రేమ.. ప్రజలకు అండగా తెలుగుదేశం జెండా పట్టి యువగళం పాదయాత్ర చేస్తున్నపుడు భుజం తట్టి నా వెంట నడిచిన మాతృ మూర్తి నీకు పాదాభివందనం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ మేరకు తనతో కలిసి నడుస్తున్న, తల్లి షూలేస్ ఊడిపోతే, లోకేష్ కడుతున్న ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. నారా భువనేశ్వరి యువగళం పాదయాత్రలో పాల్గొనటం తన భుజం తట్టి తనను ముందుకు నడిపించటం అని లోకేష్ తన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. అంతేకాదు యువ గళం పాదయాత్రను విధ్వంసక ఆటవిక సర్కార్ పై ప్రజా దండయాత్రలు చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పోస్ట్ చేశారు.
అడ్డంకుల్ని లెక్కచేయకుండా.. ఎండలకి ఆగిపోకుండా.. వర్షం పడితే చెదిరిపోకుండా.. ప్రజల కోసం నేను, నా కోసం ప్రజలు యువ గళం పాదయాత్రను ముందుండి నడిపిస్తున్నారు అంటూ లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు యువగళం వాలంటీర్లు, కమిటీలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు.
బుడిబుడి అడుగులు వేసేటప్పుడు
— Lokesh Nara (@naralokesh) May 15, 2023
తడబడకుండా పట్టుకున్న అమ్మ చేయి..
వడివడిగా అడుగులు వేసేటప్పుడు..
నడవడిక నేర్పిన తల్లి ప్రేమ..
ప్రజలకి అండగా తెలుగుదేశం జెండా పట్టి.. #YuvaGalamPadayatra చేస్తున్నప్పుడు.. భుజం తట్టి నా వెంటే నడిచిన మాతృమూర్తి
నీకు పాదాభివందనం. pic.twitter.com/MFQy4V7y3A
లోకేష్ యువ గళం పాదయాత్ర ప్రజల యాత్ర అయిందని, యువగళం జనగళం అయిందని లోకేష్ ఉద్వేగభరితమైన పోస్టులను చేశారు. మోతుకూరులో లోకేష్ యువ గళం పాదయాత్ర 100 వ రోజుల పైలాన్ ను ఆవిష్కరించనున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications