పవన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు - లోకేష్ సంచలనం..!!
నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో పవన్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీకి సంబంధం లేదని వెల్లడించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ టీటీడీ బోర్డు, అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తొలుత విభేదించిన ఛైర్మన్.. ఆ తరువాత క్షమాపణ చెప్పారు. పవన్ కోరిన విధంగా బాధితుల వద్దకు వెళ్లి బోర్డు సభ్యులు పరిహార చెక్కులు అందించారు. కాగా, పవన్ చేసిన క్షమాపణ డిమాండ్ తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి.
లోకేష్ వ్యాఖ్యలు
లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మిత్రపక్ష పార్టీ అధినేతగా పవన్ కు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కొనసాగిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో టీడీపీ నుంచి లోకేష్ కు ప్రమోషన్ కోసం పార్టీ నేతలు ప్రతిపాదనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ చేసిన డిమాండ్ తో తమ పార్టీకి సంబంధం లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. ఈ ఘటన వేళ పవన్ సీరియస్ గా స్పందించారు.

పవన్ డిమాండ్ తో
తిరుపతిలో ఘటనా స్థలిని పరిశీలించిన పవన్.. ఆస్పత్రిలో భాదితులను పరామర్శించారు. ఆ వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పారు. టీటీడీ చైర్మన్, అధికారులు సైతం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరిహార చెక్కులు ఇవ్వాలని సూచించారు. ఈ డిమాండ్ మేరకు తొలుత క్షమాపణ చెప్పేందుకు టీటీడీ బోర్డు సమావేశం తరువాత ఛైర్మన్ ఆచి తూచి స్పందించారు. ఆ తరువాత కాసేపటికే క్షమాపణ చెప్పారు. కాగా, ఇప్పుడు లోకేష్ స్పందించారు. పవన్ తిరుపతి ఘటనలో క్షమాపణ డిమాండ్ చేయటం తమ పార్టీకి సంబంధం లేదని.. పవన్ వ్యక్తిగత నిర్ణయమని చెప్పటం ద్వారా కొత్త చర్చ కు కారణమయ్యారు. ఈ వ్యాఖ్యల పైన రాజకీయంగా చర్చ మొదలైంది.
జనసేన స్పందన
పవన్ క్షమాపణ చెప్పటం... టీటీడీ బోర్డు తో చెప్పించటం పైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, ఘటన పైన చంద్రబాబు మంత్రులతో కలిసి సమీక్ష..నిర్ణయాలు వెల్లడిస్తున్న వేళ..అదే సమయంలో పవన్ తన అభిప్రాయాలను వేరుగా వెల్లడించటం పైనా అనేక రకాల అభిప్రాయలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఛైర్మన్ క్షమాపణ.. అధికారుల పై చంద్రబాబు చర్యలతో వివాదం సమిసిపోయింది. కాగా, ఇప్పుడు పవన్ చేసిన క్షమాపణ డిమాండ్ పైన లోకేష్ స్పందన తో ఇప్పుడు జనసేన ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications