పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య

పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాల పెద్దలకు వారు చెప్పారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, పెళ్లికి నిరాకరించారు. దాంతో పది రోజుల నుంచి ప్రేయసిప్రియులిద్దరు కనిపించకుండా పోయారు.
వారిద్దరు కలిసి పరారయ్యారని ఇరు కుటుంబాలవారు కూడా అనుకున్నారు. అయితే శనివారంనాడు ప్రేయసీప్రియులు బావిలో శవాలై తేలారు. పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications