ఆ డైలాగ్స్ వింటే కళ్లు చెమర్చాలందే - యాత్ర 2, వైఎస్సార్ టు జగన్..!!

వైఎస్సార్ జన్మదినం నాడు మరోసారి ఆయన పాపులర్ డైలాగ్ ప్రజల ముందుకు వచ్చింది. యాత్ర సినిమా దర్శకులు మహి వి.రాఘవ్‌ ఇప్పుడు యాత్ర 2 సిద్దం చేస్తున్నారు. ఇందులో వైఎస్సార్ మరణం నుంచి జగన్ సీఎం అయ్చే వరకూ పూర్తిగా తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్జీవీ వ్యూహం సిద్దం అవుతోంది. జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు. ఈ రోజు విడుదల అయిన యాత్ర 2 మోషన్ పోస్టర్ లో వైఎస్సార్ .. జగన్ ను ప్రజలకు దగ్గర చేసిన డైలాగ్స్ తో వీడియో విడుదల చేసారు.

వైఎస్సార్ టు జగన్: మహి వి.రాఘవ్‌ 2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా యాత్ర 2 సిద్దం చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి కొడుకుని' అనే లైన్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ రోజు వైఎస్సార్ జయంతి వేళ యాత్ర-2కు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను మహి వి.రాఘవ్‌ విడుదల చేశారు.

Mahi V Raghava Release Yatra motion poster with YSR and CM Jagan popular dialogues

పాపులర్ డైలాగ్స్ తో మరోసారి: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటలతో మోషన్‌ పోస్టర్‌ ప్రారంభం అవుతుంది. 'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే...' అంటూ ఆ నాడు ఆయన మాట్లాడిన గొంతును డైరెక్టర్‌ మహి వి.రాఘవ్‌ నేడు మళ్లీ గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ పాపులర్ డైలాగ్ చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' అనే మాటలతో వీడియో ముగుస్తుంది. వీరిద్దరూ చెప్పిన ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతగానో దగ్గరకు చేరాయి. జగన్‌ పాదయాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, ఆపై 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో ఉండనుంది.

యాత్ర 2.. వ్యూహం ఎన్నికల వేళ: ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నారు. ఇటు సంచలన దర్శకుడు ఆర్జీవీ వ్యూహం సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. వైఎస్సార్ మరణం తో మొదలు పెట్టి జగన్ సీఎం అయ్యే వరకు వ్యూహం కథనంగా తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో, ఎన్నికల సమయంలో సీఎం జగన్ పొలిటికల్ లైఫ్ పై రెండు సినిమాలు విడదులకు సిద్దం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+