బూతుబొమ్మలు పంపి వేధించిన ఆకతాయికి చుక్కలు చూపించిన గృహిణి
సోషల్ మీడియా ద్వారా అశ్లీల చిత్రాలు పంపుతూ వేధిస్తున్న ఓ ఆకతాయికి చుక్కలు చూపించిందో గృహిణి. తెలివిగా మాట్లాడి, అతడి చిరునామా కనుక్కుని వెళ్లి చెప్పు తిరగేసింది. విజయవాడలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టి
విజయవాడ: ఫేస్‌బుక్ మెసెంజర్‌లో 'హాయ్.. హలో..' అంటూ పలకరించాడు. తర్వాత అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశాడు. ఇలా తన మితిమీరిన చర్యలతో వారం రోజులుగా ఓ మహిళకు నిద్రలేకుండా చేశాడో ఆకతాయి.
ఈ ఆకతాయి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు ఎలాగైనా అతడిని పట్టుకుని బుద్ధి చెప్పాలని భావించింది. వీడియోకాల్‌లో మాట్లాడి అతడి చిరునామాను తెలుసుకుని వెళ్లి చెప్పు తిరగేసింది. కలకలం రేపిన ఈ ఘటన విజయవాడలో జరిగింది.

మొదట ‘హాయ్.. హలో..’
వివరాల్లోకి వెళితే... విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన ఓ గృహిణి(40)కి ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ఈ నెల ఒకటో తారీఖు నుంచి ‘హాయ్.. హలో..' అంటూ అసభ్యకర పేరున్న ఓ ఖాతా నుంచి సందేశాలు రావడం మొదలయ్యాయి.

ఆపైన అశ్లీల చిత్రాలు...
మొదట్లో వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆ ఆకతాయి మరింత రెచ్చిపోయి పూర్తి అశ్లీల చిత్రాలను ఆమెకు పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో సదరు గృహిణి సంబంధిత ఐడీని పరిశీలించగా 9700143141 సెల్ నంబర్ కనిపించింది. ఆ నంబర్ ఫేస్‌బుక్‌లో టైపు చేస్తే ఎస్‌కే సుభానీ పేరుతో మరో ఖాతా కనిపించింది. ప్రొఫైల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ డిజిటల్ ప్రింటర్స్‌లో పనిచేస్తున్నట్టు, సొంతూరు విశాఖపట్నం అని వివరాలు కనిపించాయి.

నేరుగా ఫోన్ కాల్స్...
అప్పటి వరకు ఫేస్‌బుక్‌లో వేధించిన సుభానీ ఆ తర్వాత 9700143141 నంబరు నుంచి నేరుగా ఆమెకు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఊరుకోకుండా ఈనెల 4 నుంచి వీడియోకాల్స్ చేయడం ప్రారంభించాడు. ఈ బాధ పడలేక ఆ గృహిణి సుభానీ నంబరును తన మొబైల్ లో బ్లాక్ చేసింది.

నంబర్ బ్లాక్ చేసినా...
అయితే సుభానీ ఊరుకోలేదు. మళ్లీ 9700872434 నంబర్‌తో ఫోన్లు చేసేవాడు. ఈ నేపథ్యంలో అతడిని అలా వదిలేస్తే లాభం లేదని, ఎలాగైనా బుద్ధిచెప్పాలని నిశ్చయించుకుని.. బాధితురాలు సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడి చిరునామా అడిగింది. దీంతో ఆమె తన లైన్ లోకి వస్తోందని సంతోషించి.. తాను మాచవరం డౌన్‌లో ఉంటున్నానని సుభానీ చెప్పేశాడు.

బుద్ధి చెప్పాలని...
తరువాత అతడి పూర్తి చిరునామా తెలుసుకోవడం కోసం ఆ గృహిణి కావాలనే ‘హాయ్.. ' అంటూ మెసేజ్ పెట్టింది. అందుకు సుభానీ స్పందించి వెంటనే వీడియో కాల్ చేశాడు. ఆ సమయంలో ఏలూరు రోడ్డులో ఉన్న ఓ ప్రింటర్స్‌లో అతడు పనిచేస్తున్నాడు. అతడు అక్కడి నుంచే ఆమెతో మాట్లాడగా.. అందులో ఆ చిరునామా ఉన్న బోర్డును ఆమె గుర్తించింది.

ఆరా తీయగా...
సుభానీ ముఖాన్ని కూడా గుర్తుపెట్టుకున్న గృహిణి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫొటోతో పోల్చి చూసింది. డౌట్ లేదు, అతడే అని నిర్ధారణ కాగానే, తన భర్త వద్ద పనిచేసే కొంతమంది సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లి మాచవరంలో గాలించగా సుభానీ అసలు చిరునామా దొరికింది. అతడు నివసిస్తున్న ఇంటికెళ్లి ఆరా తీయగా.. సుభానీ సోదరి అతడు ఏలూరు రోడ్డులో ఉన్న ఓ ప్రింటర్స్‌లో పనిచేస్తున్నాడని చెప్పింది.

చెప్పుతో ఎడాపెడా...
దీంతో బుధవారం రాత్రి అక్కడికి వెళ్లిన బాధితురాలు మొదట కాలిచెప్పు తీసుకుని సుభానీ చెంపలు ఎడాపెడా వాయించింది. ఆమె వెంట వెళ్లిన యువకులు కూడా సుభానీకి దేహశుద్ధి చేసి అతడిని నగర పోలీసు కమిషనర్‌కు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

ప్రింటర్స్ యజమాని బెదిరించాడు: బాధితురాలు
సుభానీ పనిచేస్తున్న ప్రింటర్స్ యజమాని, సహోద్యోగులు తనను బెదిరించారని కూడా బాధితురాలు ఆరోపించింది. ‘మీరు కేసు పెట్టినా మేం సుభానీని బయటకు తీసుకొస్తాం..' అని సదరు ప్రింటర్స్ యజమాని తనతో అన్నాడని ఆ గౄహిణి చెప్పింది. అంతేకాదు, ‘కేసులెందుకు..? మీరు ఒంటరిగా తిరుగుతుంటారు. మీ మీద యాసిడ్ దాడి జరిగితే మీ పరిస్థితి ఏంటి..?' అని కూడా సుభానీ సహచరులు తనను బెదిరించారని పేర్కొంది.

కాల్ గర్ల్ అనుకుని పంపా: నిందితుడు
కాల్ గర్ల్ అనుకుని తాను అశ్లీల చిత్రాలను పంపానని సుభానీ పోలీసుల ఎదుట అంగీకరించాడు. విజయవాడతోపాటు ఇతర నగరాల్లోని మహిళలకూ అతడు ఈ చిత్రాలను పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications