ఎంతకు తెగించార్రా.. సమాధి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మరీ !!

మూఢనమ్మకాల ముసుగులో మృతదేహంతో మంత్రాలు చేయాలన్న పిచ్చి నమ్మకం మానవత్వాన్ని అవమానించింది. ఈ దారుణ ఘటన ఏపీలోని మదనపల్లె మండలంలో చోటు చేసుకోవడం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒకరి మృతదేహాన్ని మంత్ర, తంత్రాల కోసం ఓ వ్యక్తి పట్టపగలే వెలికి తీయడానికి ప్రయత్నించడంతో సంచలనం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..?

మదనపల్లె పట్టణానికి చెందిన దిలీప్ రావు (23) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 1న బెంగళూరులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంకిశెట్టిపల్లె మార్గంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి ఆ శ్మశాన వాటికకు వచ్చి,.. పూడ్చిన మృతదేహం వద్ద తవ్వకాలు ప్రారంభించాడు. పశువులను మేపుతున్న కాపర్లు ఆ విషయాన్ని గమనించి నిలదీయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

man-trying-to-do-deadbody-from-grave-at-madanapalle-and-news-got-viral

కానీ మళ్లీ గంటకే తిరిగి వచ్చి మళ్లీ మట్టిని తవ్వడం ప్రారంభించాడు. ఆ సమయానికి సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని.. అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
మృతదేహం ఎందుకు వెలికి తీయాలనుకుంటున్నావని ప్రశ్నించగా.. మొదట మౌనంగా ఉన్నాడు. తర్వాత గట్టిగా అడిగితే హిందీలో మాట్లాడుతూ తన పేరు గోవింద్.. జైపూర్‌కు చెందినవాడినని తెలిపాడు.
మదనపల్లెలో ప్రస్తుతం ఉంటున్నానని వెల్లడించాడు. తన చిన్నాన్న మహేష్ చనిపోయారని.. అతనితో మాట్లాడేందుకు మంత్ర తంత్రాలు చేయాలనుకున్నానని ఒప్పుకున్నాడు.

సమాచారం అందుకున్న రూరల్ సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ గోవింద్ చెప్పిన ఈ వివరణతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. మృతదేహాలతో మంత్రాలు చేయడం ద్వారా ఆత్మలతో మాట్లాడవచ్చని అతనికి నమ్మకం ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవింద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అతని నివాస స్థలం, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. ఇంతకుముందు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

అనంతరం మృతదేహాన్ని మళ్లీ పూడ్చి, శ్మశాన వాటిక వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవింద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+