మంచు మనోజ్, భూమా మౌనిక 20న ఏం చెప్పబోతున్నారు?
రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్న అంశం ఏదైనా ఉందా? అంటే అది మంచు మనోజ్ - భూమా మౌనిక రెడ్డి వివాహ విషయం. తాజాగా మంచు మనోజ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన జీవితంలో నెక్స్ట్ పేజీలోకి అడుగు పెట్టబోతున్నానన్నారు. చాలా రోజులుగా తన మనసులో దాచుకుంటూ వస్తోన్న స్పెషల్ న్యూస్ ను ఈనెల 20వ తేదీన అందరితో పంచుకోబోతున్నానంటూ ట్వీట్ లో తెలిపారు.
మనోజ్ అందరికీ శుభవార్త చెబుతున్నాడని భావిస్తున్నారు. భూమా మౌనికరెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు 20వ తేదీన మనోజ్ ప్రకటించబోతున్నారని అందరూ భావిస్తున్నారు. ఇటీవలే కడప దర్గాకు వెళ్లిన మనోజ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే తాను కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని, ఈసారి కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తానని వ్యాఖ్యానించారు. దీంతో మనోజ్-మౌనికరెడ్డి వివాహంపై ఒక స్పష్టత వచ్చింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మనోజ్ చేసిన ట్వీట్ వైరలైంది. ఇద్దరికీ ఇది రెండో వివాహమవుతుంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ఇటీవలే అహం బ్రహ్మాస్మి అనే సినిమాను ప్రకటించారు. త్వరలోనే దీన్ని పట్టాలెక్కించి అభిమానులను కలవబోతున్నానంటూ గతంలోనే ఒక ట్వీట్ చేశారు.

తాజాగా మనోజ్ ట్వీట్ చేసినట్లుగా ఫిబ్రవరి నెలలో వీరి వివాహానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలవల్ల ఇద్దరూ మొదటి వివాహ బంధానికి దూరమయ్యారు. వీరిద్దరి వివాహాన్ని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు కూడా ఇటీవలే ధ్రువీకరించారు. మోహన్ బాబు కుటుంబానికి ఈ వివాహం ఇష్టం లేదని, అందుకే కుటుంబానికి దూరంగా మనోజ్ ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే పెద్దలను ఒప్పించే మౌనికను వివాహం చేసుకోవాలనుకుంటున్న మనోజ్ అందరూ అంగీకరించడంతో 20వ తేదీన చేసే ట్వీట్ ద్వారా పెళ్లి విషయాన్ని చెప్పబోతున్నట్లు భావిస్తున్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications