పవన్ కు మందకృష్ణ ఘాటు కౌంటర్- మీ శాఖ లాక్కుంటానంటే ? మీరు కాపులకే పెద్దన్న..
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న మహిళలపై అఘాయిత్యాల విషయంలో పోలీసుల వైఖరిని, హోంమంత్రి వంగలపూడి అనిత వైఖరిని తప్పుబడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపాయి. పవన్ తీరుపై ఇప్పటికే దళిత వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబును కలిసిన దళిత నేత మందకృష్ణ మాదిగ పవన్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బయటికి వచ్చి పవన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళిత హోంమంత్రిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి ఆ విధంగా రావడం దురదృష్టకరం అన్నారు. మాదిగ మహిళ అనితను అవమానిచినట్లే కదా అన్నారు. అది మేము దృష్టి లో పెట్టుకుంటాం అన్నారు. ఎన్నికల సమయంలోనే పవన్ పట్ల తాము అసంతృప్తిని వ్యక్తం చేశామని గుర్తుచేశారు.జనసేన అందరి పార్టీనా కాదా అని మందకృష్ణ ప్రశ్నించారు. కమ్మ, కాపులే కాదు అందరూ జనసేనకు ఓట్లేశారని గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్ కాపులకు పెద్దన్నఏమో.. తమకు కాదన్నారు. జనసేనకు కేటాయించిన బీసీ,ఎస్సీ, ఎస్టీలకు ఇంకో సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ మూడు సీట్లు మాలలకు ఇచ్చారన్నారు. ఇదేవిధంగా పవన్ కళ్యాణ్ తన శాఖ సరిగా చేయలేదని ఇంకో మంత్రి అంటే ఎలాగా వుంటుందని నిలదీశారు. పవన్ కళ్యాణ్ ను నీ శాఖను నేను తీసుకుంటానని మరొక మంత్రి అంటే ఎలా ఉంటుందన్నారు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టమన్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే సిఎం చంద్రబాబు ను అన్నట్లు కాదా అని అడిగారు.












Click it and Unblock the Notifications