నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్

నాన్నకోసం మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో అదరగొడుతున్నారు. ఇక బాబాయి పార్టీని గెలిపించాలని, బాబాయి ఆశయాల సాధనకు బాసటగా నిలవాలని మెగా హీరోలు ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. నాన్నకు, బాబాయ్‌కు తోడుగా మెగా ఫ్యామిలీ అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎన్నికల బరిలో నిలిచిన తండ్రి, బాబాయ్‌ల కోసం నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి విపరీతమైన స్పందన వస్తుంది. మెగా హీరో వరుణ్ తేజ్ ను చూడటానికి ఫ్యాన్స్ తెగ ఎగబడుతున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ .. పార్టీ శ్రేణుల్లో జోష్

ప్రచారంలో దూసుకుపోతున్న వరుణ్ తేజ్ .. పార్టీ శ్రేణుల్లో జోష్

నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్న లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. రెండు రోజులుగా నర్సాపురం, తణుకు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో జనసేన కోసం ప్రచారం చేస్తున్నారు. జనసైనికులతో కలిసి రోడ్ షోలతో ఆకట్టుకుంటున్నారు. శుక్రవారం నుంచి ప్రచారం మొదలు పెట్టిన మెగా వారసుడు.. అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.. జనసైనికులతో పాటు యువతను ఉత్సాహపరుస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. తన తండ్రి , బాబాయి ప్రజలకు సేవ చెయ్యాలని ముందుకు వచ్చారని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

మంచి ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన .. ఆదరించాలని వరుణ్ తేజ్ పిలుపు

మంచి ఆశయాలతో పెట్టిన పార్టీ జనసేన .. ఆదరించాలని వరుణ్ తేజ్ పిలుపు

మహోన్నత ఆశయాలు,సిద్దాంతాలు, విలువలుతో జనసేనపార్టీని బాబాయి పవన్ కళ్యాణ్ స్థాపించారని చెప్పిన మెగా హీరో అవినీతి రహిత పాలన అందించే జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. తణుకులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎలాంటి స్వార్థం లేని వ్యకి రామారావు గారిని ఎమ్మెల్యేగా .. ఎంపీగా తన తండ్రి నాగబాబును గెలిపించాలని కోరారు. ఇక బాబాయి గురించి చెప్పిన వరుణ్ తేజ్ బాబాయ్ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారని,పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలని తమ కుటుంబం ఎప్పటి నుంచో ఎదుర్కొంటోందన్నారు. అవి తమకు కొత్త కాదని.. రాజకీయాల్లోకి మంచి వ్యక్తి వచ్చినప్పుడు తొక్కేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారని అదే బాబాయి విషయంలో జరుగుతోందని ఆయన చెప్పారు.

జనసేన కోసం కదిలిన మెగా హీరోలు .. ప్రచారంలో జోష్

జనసేన కోసం కదిలిన మెగా హీరోలు .. ప్రచారంలో జోష్

జనసేన తరపున ప్రచారం కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. ఒకపక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అస్వస్థత నేపధ్యంలో మెగా హీరో రామ్ చరణ్ కూడా నేటి నుండి రంగంలోకి దిగనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపధ్యంలో నాగబాబు కుమార్తె నిహారిక, ఆయన సతీమణి పద్మజ, కుమారుడు మెగా హీరో వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+