బంపర్ ఛాన్స్ కొట్టేసిన అనిల్ రావిపూడి?
తక్కువ సమయంలో ప్రతిభావంతుడైన దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో దాదాపుగా అన్నీ విజయవంతమైన సినిమాలే రూపొందాయి. ప్రస్తుతం బాలకృష్ణ కథానాయకుడిగా భగవంత్ కేసరి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతోంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత అనిల్ తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలకృష్ణ సినిమా పూర్తికాగానే మెగాస్టార్ చిరంజీవితో అనిల్ సినిమా చేయబోతున్నారనే వార్త సంచలనంగా మారింది. తాను నాగార్జున, చిరంజీవితో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో అనిల్ తెలిపారు. చిరంజీవితో పనిచేసే అవకాశం వచ్చిందని, బాలయ్య సినిమా పూర్తికాగానే ఈ సినిమా పనుల్లో బిజీ అవుతాడని తెలుస్తోంది.

జగదేవ వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒకటి రూపుదిద్దుకోబోతోంది. అయితే చిరంజీవికానీ, అనిల్ కానీ ఈ వార్తలను ఖండించలేదు. అదే నిజమైతే మెగాస్టార్ ఖాతాలో మరో హిట్ సినిమా పడినట్లేనని తెలుస్తోంది. చిరంజీవి కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతోంది. తర్వాత కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇది పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అనిల్ సినిమా అంటే మినిమ్ గ్యారంటీ ఉంటుందనే భరోసా అటు నిర్మాతలతోపాటు ఇటు ఎగ్జిబిటర్లలో కూడా నెలకొంది. భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ కొడతాడని అనిల్ అభిమానులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications