బాబోయ్.. వామ్మో.. దుమ్మురేపిన భోళాశంకర్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రరాజం భోళాశంకర్. ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా కథానాయిక కాగా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించింది. సుశాంత్, రఘుబాబు, రావు రమేష్, షాయాజీ షిండే, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు. విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి గత సినిమా ఆచార్యను మించిన ఫ్లాప్ అంటూ అభిమానులు కూడా నిరుత్సాహపడ్డారు.

భోళా శంకర్ చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి కేవలం రూ.27.03 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. అంటే.. బ్రేక్ ఈవెన్ కు రూ.51.97 కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుతం ఈ సినిమా ఉన్న పరిస్థితి.. వచ్చిన టాక్ గమనిస్తే బ్రేక్ ఈవెన్ ఆమడ దూరంలో ఉంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీస్థాయిలో నష్టాన్ని మిగిల్చిన మరో చిత్రరాజం భోళాశంకర్.

ప్రపంచవ్యాప్తంగా వసూలైన కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే నైజాం 6.89 cr, సీడెడ్ 3.26 cr, ఉత్తరాంధ్ర 3.19 cr, ఈస్ట్ 1.98 cr, వెస్ట్ 2.21 cr, గుంటూరు 2.67 cr, కృష్ణా 1.62 cr, నెల్లూరు 1.18 cr, ఏపీ + తెలంగాణ (టోటల్) 23.00 cr, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.83 cr, ఓవర్సీస్ 2.20 cr, రాగా వరల్డ్ వైడ్ (టోటల్) 27.03 cr (షేర్).

చిత్రమైన విషయం ఏమిటంటే.. చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయినప్పటికీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే చిన్న చిన్న సినిమాలకు కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి శాటిలైట్ చానల్స్ ప్రయత్నించేవి. కానీ సినిమా విడుదలై వారం గడిచిన తర్వాత కూడా రైట్స్ కోసం ఎవరూ ముందుకు రావడంలేదు. నిర్మాత ఏం చేస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications