మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబు, కేటీఆర్ లతోపాటు రాజకీయ ప్రముఖుల నుండి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

తెలుగు సినిమా ప్రపంచంలోనూ, రాజకీయాల్లోనూ తనదంటూ ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్న మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల లోనూ మెగాస్టార్ అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అభిమానులు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను కొనసాగిస్తున్నారు.

చిరంజీవికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఇక సినిమా ప్రముఖులతోపాటు, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ గా సినీ ప్రేక్షక హృదయాలలో స్థిరపడిన నటులు చిరంజీవి అని పేర్కొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీరు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం. మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అంటూ చంద్రబాబు విష్ చేశారు.

మీ సినీ ప్రస్తానం ఎందరికో స్పూర్తిదాయకం: నారా లోకేష్


ఇక మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా పద్మభూషణ్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. .పట్టుదలతో పైకెదిగిన మీ సినీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు.ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు,సినీ కార్మికుల కోసం ఆసుపత్రిని కట్టించడం హర్షణీయం అని లోకేష్ ప్రశంసించారు. మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ లోకేష్ పేర్కొన్నారు.

ప్రియమైన మెగాస్టార్ అంటూ విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్

ఇక చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ పద్మభూషణ్, ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. మీరు సంతోషంగా, ప్రశాంతంగా, మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

అపూర్వ నటుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు: బండి సంజయ్

తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ మరియు అపూర్వ నటుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ట్వీట్ చేశారు.
మీకు దీర్ఘాయువు తో ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అంటూ పేర్కొన్నారు బండి సంజయ్. ప్రజలకు వినోదం, సేవను కొనసాగించండి అంటూ ఆయన చిరంజీవినుద్దేశించి ట్వీట్ చేశారు.

స్వయంకృషితో ఎదిగిన విజేత అంటూవైసీపీ ఎంపీ సాయిరెడ్డి విషెస్


మెగాస్టార్, పద్మభూషణ్ చిరంజీవి గారికి ఆత్మీయ పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సినీ పరిశ్రమలో 'స్వయం కృషి'తో ఎదిగిన 'విజేత'.. సేవా కార్యక్రమాల్లో స్ఫూర్తి ప్రదాత మీరు అంటూ చిరంజీవిని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో మీరు 'చిరంజీవి'గా వర్ధిల్లాలని, అసంఖ్యాకమైన మీ అభిమానులకు ఆనందాన్ని పంచాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

ఎమోషనల్ గా చిరంజీవికి విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్ ..


ఇక ఇప్పటికే నా ప్రియమైన సోదరుడికి అంటూ పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి జన్మదిన సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. చిరంజీవి గురించి ఒక్క మాటలో చెప్పలేం అని ఆయన జీవితం తెరిచిన పుస్తకం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం మెగాస్టార్ చిరంజీవి సొంతమని, అలాంటి వ్యక్తికి తన పూర్వజన్మ సుకృతం అని పవన్ కళ్యాణ్ అన్న గొప్పతనాన్ని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+