గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మెగాస్టార్ చిరంజీవి:మరో ముగ్గురు ప్రముఖులకు సవాలు
Recommended Video

హైదరాబాద్: భాషా,ప్రాంతీయభేదాలు లేకుండా వివిధ రంగాల ప్రముఖుల మధ్య విభిన్న విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఛాలెంజ్ లు ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇదే కోవలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి ప్రాంగణంలో తానే స్వయంగా మట్టిని తవ్వి, మూడు మొక్కలను నాటి, నీరు పోశారు. అలా ఛాలెంజ్ ను విజయవంతంగా ఫుల్ ఫిల్ చేసిన చిరంజీవి అనంతరం మరో ముగ్గురు ప్రముఖులకు ఈ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆ ప్రముఖులెవరో తెలుసుకోవాలనుందా?...చదవండి మరి...

హరిత సవాలు...చిరంజీవి
ప్రస్తుతం పర్యవరణ పరిరక్షణకు సంబంధించిన గ్రీన్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఆ క్రమంలో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన హరిత సవాలు(గ్రీన్ ఛాలెంజ్) ను స్వీకరించిన మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పెరట్లో తానే మూడు మొక్కలకు గుంటలు తవ్వి మొక్కలు నాటి సవాలును విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తరువాత తాను మరో ముగ్గురు ప్రముఖులకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

ఆ ముగ్గురు...ఎవరంటే?
ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను మెగాస్టార్ చిరంజీవి ఈ గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. మరోవైపు, ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇప్పటికే దేశ్యవాప్తంగా పెద్దఎత్తున స్పందన లభిస్తోంది.

ఇప్పటికే...పూర్తి చేసిన విఐపిలు...
ఇప్పటికే మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, సీనియర్ నటుడు మోహన్‌బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు, క్రికెటర్ సచిన్ తెందూల్కర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు.

మెగాస్టార్ ప్రస్తుతం...‘సైరా నరసింహారెడ్డి' తో బిజీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications