Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏజ్ పెరిగినా గ్రేస్ తగ్గని మెగాస్టార్ చిరంజీవి... వైరల్ వీడియో!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే చాలు ఇప్పటికీ చాలామంది ఉర్రూతలూగిపోతారు. మెగాస్టార్ చిరంజీవి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రామ్ చరణ్, మెగాస్టార్ ని చూసే తను డాన్స్ నేర్చుకున్నానని అనేకమార్లు చెప్పిన అల్లు అర్జున్, ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్, ఇలా ఎంతమంది వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవికి ఎంతోమంది అభిమానులు గుండెల్లో గుడి కట్టారు.

సినిమాలలో డ్యాన్స్ కు బెంచ్ మార్క్ సెట్ చేసిన చిరంజీవి
గ్యాంగ్ లీడర్ అంటూ స్టెప్పులతో అదరగొట్టినా, నేనే ముఠామేస్త్రిని అంటూ ప్రతి ఒక్కరినీ మాస్ ఇమేజ్ తో మై మరిచిపోయేలా చేసిన అది చిరంజీవికే సొంతం. చిరంజీవి కంటే ముందు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ వేరు. చిరంజీవి తర్వాత సినిమా ఇండస్ట్రీలో డాన్స్ వేరు. సినిమాలలో డాన్స్ ఏ విధంగా ఉండాలి అని బెంచ్ మార్క్ సెట్ చేసిన వాడు చిరంజీవి అని చెప్పక తప్పదు.

Megastar Chiranjeevi grace in dance never fadeout despite his age Viral video

డ్యాన్స్ ఏదైనా సరే అది చిరంజీవి చేస్తేనే
అంతకుముందు సినీ హీరో లు పెద్దగా డాన్స్ చేసిన దాఖలాలు లేవు. బ్రేక్ డాన్స్ లు చేసిన, షేక్ డాన్స్ లు చేసిన తనదైన గ్రేస్ తో అందరిని ఆకట్టుకున్న వాడు చిరంజీవి. అటువంటి చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో తన డాన్సులతో కొత్త ఒరవడిని సృష్టించి ప్రజల అభిమానాన్ని పొందాడు. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవికి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి పురస్కారాలతో సన్మానించింది.

ప్రజల గుండెల్లో నిలిచిపోయిన చిరంజీవి డ్యాన్స్
మొత్తం 46 సంవత్సరాల కాలంలో చిరంజీవి తన 156 సినిమాలలో, 537 పాటలలో, 24వేల డాన్స్ మూవ్స్ చేసినట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా స్థానం దక్కించుకున్నారు. ఇప్పటికీ చాలామందికి డాన్స్ అనగానే చిరంజీవి గుర్తొస్తారు అంటే అంతగా చిరంజీవి డాన్స్ ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయింది.

69 ఏళ్ళ వయసులో చిరంజీవి డ్యాన్స్
ప్రస్తుతం చిరంజీవి వయస్సు 69 సంవత్సరాలు. ఈ వయసులో కూడా చిరంజీవి సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలను మించి ప్రేక్షకుల మనసులను కొల్లగొడుతున్నాడు. ఈ వయసులో కూడా డాన్స్ లో తన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ఇటీవల చిరంజీవికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఏజ్ పెరిగినా చిరంజీవి గ్రేస్ తగ్గలేదని కామెంట్స్
ఒక ఛానల్ వార్షికోత్సవానికి వెళ్ళిన చిరంజీవి అక్కడ ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని చామంతి పువ్వా పువ్వా పాటకు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తో కలిసే అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం చిరంజీవి డాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిని చూసినవారు ఏజ్ పెరిగినా చిరంజీవి గ్రేస్ తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫాన్స్ అయితే తమ అభిమాన హీరో డాన్స్ చూసి సంబరపడిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+