మేలుకో తెలుగోడా.. నారా భువనేశ్వరి బస్సు యాత్ర!!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం కాగా, ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.

అయితే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, కక్ష సాధింపు చర్యలో భాగంగా చంద్రబాబు అరెస్టు జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి, చంద్రబాబు కోసం పోరాటాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

meluko telugoda.. nara bhuvaneshwari bus yatra

ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ గురించి, తన భర్త చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించారని, ఆయన ఎప్పుడూ ఏపీ ప్రజల సంక్షేమం కోసమే ఆలోచించారని ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్న భువనేశ్వరి, తెలుగుదేశం పార్టీలో కీలకంగా భూమిక తీసుకునే అంశంపై ప్రస్తుతం టిడిపిలో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నారా భువనేశ్వరిని పొలిటికల్ గా యాక్టివ్ చేస్తే ప్రజలపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

భువనేశ్వరి రాజకీయంగా రంగంలోకి దిగితే వైసిపి విమర్శలు పెరుగుతాయని, వైసిపి నేతల మాటలను తట్టుకుని భువనేశ్వరి ముందుకు సాగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. తెలుగింటి సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన భువనేశ్వరి తనపై జరిగే వాటిని తట్టుకోగలుగుతారా? నిలబడగలుగుతారా అన్నది ఇప్పుడు పొలిటికల్ యాక్షన్ కమిటీ చర్చిస్తుంది.

భువనేశ్వరి తో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయిస్తే ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, చంద్రబాబు కోసం ప్రజలు ఆలోచించేలా చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. విజ‌య‌మ్మ మాదిరిగానే భువ‌న‌మ్మ కూడా రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇప్ప‌టికే వివిధ ద‌శ‌ల్లో వివిధ ప్రాంతాల‌కు చెందిన నేత‌ల‌తో ఆమె వ‌రుస‌గా భేటీ అవుతున్నారు.

పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. అలానే ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. సోష‌ల్ మీడియాకు వీడియోలు విడుద‌ల చేస్తూ త‌న బాధ, ఆవేద‌న చెప్పుకుంటున్నారు. తాజాగా ఆమె మేలుకో తెలుగోడా పేరిట బ‌స్ యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు అన్నది టాక్. భువనేశ్వరి బస్సుయాత్ర చేపడతారా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+