Nara Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ చేసిన మెటా ! స్వయంగా ట్వీట్..

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత బిజీగా ఉంటున్న నేత ఏపీ మంత్రి నారా లోకేష్. చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఆయన్ను కలిసేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో జనం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన నియోజకవర్గం మంగళగిరి ప్రజలతో పాటు ఇతరులు కూడా లోకేష్ ను వాట్సాప్ లో సైతం సంప్రదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన వాట్సాప్ ఖాతా స్తంభించింది.

తన వాట్సాప్ నంబర్ బ్లాక్ కావడంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో స్పందించారు. తన వాట్సాప్ ఖాతా బ్లాక్ కావడం వెనుక కారణాన్ని వెల్లడించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తనను ఎలా రీచ్ కావాలో ఆయన వెల్లడించారు. దీంతో లోకేష్ ను ప్రత్యామ్నాయ మార్గాల్లో సంప్రదించేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. లోకేష్ తన ఎక్స్ పోస్ట్ లోనే తనను ఎలా సంప్రదించాలో వివరించారు.

Meta Blocks ap minister nara Lokesh WhatsApp account- here is reason

ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ ను మెటా బ్లాక్ చేసిందని లోకేష్ వెల్లడించారు. మీ సమస్యలు దయచేసి తనకు వాట్సప్ చేయొద్దని సూచించారు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] పంపించాలన్నారు. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి [email protected] క్రియేట్ చేసుకున్నట్లు తెలిపారు.

తనను సంప్రదించాలనుకునే వారు తమ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయాలని లోకేష్ సూచించారు. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని లోకేష్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+