చంద్రబాబు అరెస్ట్ పై అంబటి కీలక వ్యాఖ్యలు..!!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు..తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ టీడీపీ అధినేత చేసిన కామెంట్స్ పైన స్పందిస్తున్నారు. చంద్రబాబు చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు నోటీసుల వ్యవహారం పై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించటం లేదని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు సింపథీ గేమ్ ప్రారంభించారని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. తన పైన దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. దీని పైన అధికార వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. చంద్రబాబు ఐటీ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లుగా ఐటీ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాజాగా, మంత్రి అంబటి రాంబాబు ఇదే అంశం పైన స్పందదించారు. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటే అని ...చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని మంత్రి అంబటి రాంబాబుఅన్నారు.

Minister Ambati Rambabu fires on TDP cheif Chandra Babu questioned over IT notices

చంద్రబాబు తప్పు చేశారు కాబట్టి ఆయనకు భయమేస్తుందని పేర్కొన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది అంటూ సెటైర్ విసిరారు. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారని.. అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని చెప్పుకొచ్చారు. చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని కూడా అరెస్టు చేస్తారన్నారు. ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరన్నారు. చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడని.. ఆయన హీరోనే అంటారన్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిదని తెలిపారు.

చంద్రబాబు రూ.118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్న పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మంత్రి రోజా సైతం ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు జైలుకెళ్లితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా అని ప్రశ్నించారు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటని రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+