పవన్ కారణంగా చిరంజీవి నష్టపోయారు - మంత్రి అంబటి..!!

జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. సంస్కారం గురించి పవన్‌ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాలంటరీ వ్యవస్థపై అభ్యంతరం ఏంటని మంత్రి అంబ‌టి ప్ర‌శ్నించారు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పటికి ఎమ్మెల్యే కాలేరని వ్యాఖ్యానించారు.

ప్రజారాజ్యంలో ఉన్న సమయంలో పవన్ ఇప్పుడు మాట్లాడుతున్న తరహాలోనే వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసి మూల్యం చెల్లించుకున్నార‌ని గుర్తు చేశారు. అప్పుడే పవన్‌ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని తెలిపారు. వైఎస్సార్ పైన పవన్ చేసిన వ్యాఖ్యల కారణంగా చిరంజీవి ఎన్నికల్లో నష్టపోయారని చెప్పుకొచ్చారు. జగన్ సీఎం కుమారుడిగా సులువుగా సీఎం కాలేదని రాంబాబు చెప్పుకొచ్చారు. వైఎస్సార్ మరణం తరువాత..జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పోరాటం ప్రతీ ఒక్కరికీ తెలుసన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎందరో పార్టీలు పెట్టారని...సీఎంలు కాలేదని రాంబాబు వివరించారు.

ambatichiranjeevipawankalyan1

అసభ్యపదజాలం ప్రయోగించిన పవన్ సంస్కారం గురించి మాట్లాడతావా అంటూ ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని.. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారని ఎద్దేవా చేసారు. కాపులను మచ్చిక చేసుకోవడానికి ఉభయగోదావరి జిల్లాల్లో తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. పవన్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఆవహించిందని ఆరోపించారు. పవన్ కోసం పని చేసేందుకు వెళ్లిన ప్రముఖులు..పేరున్న వ్యక్తులు ఆ డిజార్డర్ తట్టుకోలేక వెనుక్కు వచ్చేసారని రాంబాబు వివరించారు.

వాలంటీర్ వ్యవస్థ రద్దు కావాలని పవన్ ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. వాలంటీర్లు చేసే ప‌ని ప‌వ‌న్‌కు తెలుసా అని నిలదీసారు. చంద్రబాబు పాలనలో పింఛన్లు ఎలా అందాయో గుర్తు చేసుకోవాలన్నారు. జగన్ పాలనలో పింఛన్లు ఎలా అందుతున్నాయో..తెలుసుకోలేని అజ్ఞాని పవన్ కల్యాణ్ అంటూ ఫైర్ అయ్యారు. జ‌గ‌న్ పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదని..ముఖ్యమంత్రి జ‌గ‌న్ కి అడుగు దూరంలోకి కూడా రాలేవని హెచ్చరించారు. చంద్రబాబుని సీఎంని చేయలేవు అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.వైయ‌స్ జగన్ మళ్లీ జెండా ఎగరేస్తాడనే భయంతో దుష్టచతుష్టయం అల్లాడిపోతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+