బీజేపీలో టీడీపీ విలీనం- ఢిల్లీ కేంద్రంగా: ఆ భేటీపై..!!

అమరావతి: కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టయిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. రాజకీయంగా సమీకరణాలు మారిపోతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీలు ఒక్కటవుతున్నాయి.

ఈ స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. బెయిల్ కోసం ఆయన చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. వివిధ న్యాయస్థానాల్లో అవి విచారణలో ఉన్నాయి. క్వాష్ పిటీషన్ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉంది.

Minister Ambati Rambabu mocks Nara Lokesh

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. హస్తిన వేదికగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు పురంధేశ్వరి, జీ కిషన్ రెడ్డితో కలిసి నారా లోకేష్.. అమిత్ షాను కలిశారు.

Minister Ambati Rambabu mocks Nara Lokesh

ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనే విషయాన్ని నారా లోకేష్ గానీ, పురంధేశ్వరి లేదా జీ కిషన్ రెడ్డి గానీ బయటపెట్టలేదు. ముఖ్యంమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ కంప్లైంట్ చేయడం ఒక ఎత్తయితే.. టీడీపీ విలీన ప్రతిపాదనలు తెరమీదికి వచ్చాయనే ప్రచారం జరుగుతోండటం మరో ఎత్తు.

వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ.. పూర్తిగా బీజేపీలో విలీనమౌతుందని, అందుకే- ఏపీ, తెలంగాణ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారనే వాదనలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీలో విలీనం తప్పదనే అభిప్రాయాలు సైతం ఈ భేటీ తరువాత ఊపందుకున్నాయి.

వాటన్నింటిపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా..? అనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీలో టీడీపీ విలీనం తప్పకపోవచ్చనే ఆయన ఈ సింగిల్ లైన్ ట్వీట్‌‌‌తో అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+