చిత్రం భళారే విచిత్రం ! గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండా ! అంబటి సెటైర్!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఏపీలోని రాజకీయ పార్టీలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపును జీర్ణించుకోలేక పోతుంది అన్న టాక్ వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఏపీలో వైఎస్ఆర్సిపి పై ప్రభావం పడుతుందని, వచ్చే ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు సహకరించే అవకాశం ఉంటుందని భావిస్తుంది.

ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిన్నటి నుండి టిడిపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ భవన్ ముందు టిడిపి జెండాలు పట్టుకుని కార్యకర్తలు హంగామా చేయడాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి దేనికి అంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ సహకారాన్ని అందించింది అని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Minister ambati rambabu satires that Telugudesam flags in Gandhi Bhavan!!

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబును ఈ వ్యవహారంలో టార్గెట్ చేస్తే తాజాగా మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ కాంగ్రెస్ భవన్ ముందు తెలుగుదేశం జెండాలు అంటూ కాంగ్రెస్ టిడిపి ఒకటేనని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి మద్దతు కోరడం దేనికి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన అంబటి రాంబాబు చిత్రం భళారే విచిత్రం తెలంగాణ కాంగ్రెస్ భవన్ ముందు తెలుగుదేశం జెండాలు అంటూ టార్గెట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నాడు అన్న విషయాన్ని తెలియజేసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముందు టిడిపి జెండాలను ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు.

Minister ambati rambabu satires that Telugudesam flags in Gandhi Bhavan!!

ఈ విధంగా టార్గెట్ చేయడం ద్వారా అధికారం కోసం చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+