చంద్రబాబు, పవన్ కళ్యాణ్ tdp - jsp పొత్తు రాజకీయాలపై మంత్రి అంబటి షాకింగ్ పోస్ట్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో జరిగిన ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసిపి తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేస్తూ, ప్రజాక్షేత్రంలోకి వెళుతూ దూకుడును కొనసాగిస్తుంది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలతో ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాన అస్త్రంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ, వచ్చే ఎన్నికలలో వైసిపికి విజయాన్ని అందించాలని అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తులు ఖరారు కాగా బిజెపి ఇంకా డైలమాలో ఉంది.

Minister Ambati Rambabu shocking post on pawan kalyan and chandrababu over tdp jsp alliance

తాజాగా జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. ఈసారి ఎన్నికలలో వైసీపీని ఓడించడం, వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్ద దించడం లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.

ఇక మరోవైపు అధికార వైసీపీని టార్గెట్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతూ వైయస్ షర్మిల కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఇదిలా ఉంటే జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తులను వైసిపి పదే పదే టార్గెట్ చేస్తోంది. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబులో పొత్తులపై నిత్యం విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

చంద్రబాబు ఇచ్చే డబ్బులకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అమ్ముకున్నాడని, చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని నిత్యం విమర్శించే అంబటి రాంబాబు తాజాగా వారిద్దరి పొత్తులతో పవన్ కళ్యాణ్ కు క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ బాబుకి కాస్ట్ ఓటు మాత్రం ట్రాన్సఫర్ కాదు అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. వారు ఎన్ని రాజకీయాలు చేసినా వారికి ఓటు ట్రాన్స్ఫర్ కాదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+