బాబుకు 'కేబినెట్' షాక్: ఎమ్మెల్యేగా ఉండను.. బొజ్జల రిజైన్, బోండా ఉమ హెచ్చరిక
కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తీసుకు వచ్చింది. ఆయనకు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, బోండా ఉమలు షాకిచ్చారు.
అమరావతి: కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తలనొప్పులు తీసుకు వచ్చింది. ఆయనకు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి, బోండా ఉమలు షాకిచ్చారు.
తనను మంత్రి పదవి నుంచి తొలగించడంతో బొజ్జల అసంతృప్తితో ఉన్నారు. అలాగే, తనను కేబినెట్లోకి తీసుకోకపోవడంపై బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బొజ్జల సీఎం చంద్రబాబుకు, స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు రాజీనామా లేఖ పంపించారు. తాను సాధారణ కార్యకర్తలా పని చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా కూడా కొనసాగనని చెప్పారు.
మరోవైపు, బోండా ఉమ అలిగారు. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. బోండా ఉమని మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని నాని బుజ్జగిస్తున్నారు.












Click it and Unblock the Notifications