అమలాపురం విధ్వంసం వెనుక ఆ ఇద్దరు - నినాదాలు చేసారు : మంత్రి రాజా..!!

అమలాపురం విధ్వంసంలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేదిలేదని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేసారు. కోనసీమ జిల్లాకు కోనసీమ - అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయని వివరించారు. మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు మొత్తంగా ఏకకంఠంతో కోనసీమ-అంబేడ్కర్ జిల్లాకు మద్దతు పలికారని చెప్పారు. ప్రభుత్వం ఆ విధంగా ముందుకువెళ్ళి నిర్ణయం తీసుకున్నాక, టీడీపీ, జనసేన పార్టీలు అగ్గి రాజేశాయని ఆరోపించారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు జరుగుతుందని వివరించారు.

ఆ రెండు పార్టీలే కారణమంటూ

ఆ రెండు పార్టీలే కారణమంటూ

నేరం చేసిన వారికి, తగిన శిక్షలు కూడా పడతాయన్నారు. నాడు తుని ఘటనకు కూడా చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఈరోజు అమలాపురంలో విధ్వంసం జరగటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళకు నిప్పు పెట్టడం, విధ్వంసం చేయడానికి కూడా ఆయనే కారణమంటూ ధ్వజమెత్తారు. ఒక రైలును తగులబెట్టాలంటే.. అగ్గి పెట్ట గీసి వేస్తే మంటలు రావు... అదే ట్రైన్ లో ప్రయాణించి, ట్రైన్ లోపల నుంచే నిప్పు పెట్టి, అప్పట్లో తుని విధ్వంసానికి పాల్పడ్డారన్నారు.

నాడు తునిలో..నేడు ఇక్కడ

నాడు తునిలో..నేడు ఇక్కడ

అదేరీతిలో, ఈరోజు కూడా పక్కా ప్రీ ప్లాన్డ్ గానే వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడులు చేశారని ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేయలేదా అని మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. జనసేన పార్టీ తరఫున రిప్రజెంటేషన్లు ఇవ్వలేదా అని నిలదీసారు. బహిరంగంగా ఒక మాట, వెనుక మరో మాట మాట్లాడటం పవన్ కల్యాణ్ కు సరికాదన్నారు. అమలాపురం ఘటనలో.. ప్రభుత్వం తక్షణమే స్పందించి, చర్యలు తీసుకున్నది కాబట్టే, అల్లర్లు అగాయి.

ఆందోళనకారులు నినాదాలు చేసారు

ఆందోళనకారులు నినాదాలు చేసారు

చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా పోలీసులను రప్పించి, రాత్రి 9 గంటల నుంచి పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిందని వివరించారు. అమలాపురం విధ్వంసం వెనుక ఎవరున్నారనే దానికి.. నిన్న మీడియాలో వచ్చిన వీడియో క్లిప్స్ చూస్తే అర్థమవుతుందన్నారు. అన్ని టీవీల్లోనూ, పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళుతున్న ఆందోళనకారులు జై జనసేన.. జై పవన్ కల్యాణ్.. అంటూ నినాదాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారంటూ మంత్రి చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సహకారంతో చంద్రబాబే ఇవన్నీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+