పవన్ కల్యాణ్ కు జోగి రమేష్ హెచ్చరిక..!!

ముఖ్యమంత్రి జగన్ పైన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. దీని పైన స్పందించిన మంత్రి జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ మీద విమర్శలు చేస్తే చూస్తూ కూర్చోమని జోగి రమేష్ హెచ్చరించారు. పొత్తు పెట్టుకుంటే తమకు సంబంధం లేదని..ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడటం ఏంటని నిలదీసారు. జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

జగన్ రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య నాయకుడిగా జోగి రమేష్ అభివర్ణించారు. 2011లో కడప పార్లమెంట్ కి ఉప ఎన్నిక జరిగితే దెశమంతా చూసేలా అయిదు లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారని గుర్తు చేసారు.ఇక 2019 నాటికి 151 సీట్లతో దేశమంతా చర్చించుకునేలా అద్భుతమైన మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతీ ఇంటికి అందిస్తున్నారని వివరించారు. జగన్ ని అది చేస్తాం, ఇది చేస్తామని అన్న వారు అంతా ఏమైపోయారో పవన్ తెలుసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని టీడీపీ నుంచి సీట్లు తెచ్చుకుని పోటీ చేయటం పవన్ ఇష్టమని.. జగన్ వంటి రాజకీయ యోధుడి గురించి ఒక్క మాట అనే హక్కు పవన్ కి లేదని అన్నారు.

Minister Jogi Ramesh Made serious comments against Pawan Kalyan

చిరంజీవి ప్రజారాజ్యంలో పవన్ కల్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేసారని..ఆ పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకున్నారని ఎద్దేవాచ ేసారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా బాబుకు హోల్ సేల్ గా అప్పగించారని విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ అవినీతిపరులు అని తిట్టిన పవన్ కి ఇపుడు చంద్రబాబు ఎందుకు అంతలా నచ్చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక విలువ, సిద్ధాంతాలు లేని వ్యక్తి పని అన్నారు. జైలులోకి ములాఖత్ పేరిట వెళ్ళి మిలాఖత్ అవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. తమ సీఎం అవుతాడని జనసైనికులు జెండా పట్టుకుని తిరుగుతున్నారని, వారందరినీ మోసం చేసి టీడీపీ జెండాను పవన్ పట్టుకున్నారని జోగి రమేష్ విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+