ఉచిత గ్యాస్ అమలు వారికే - ఎలా పొందాలంటే.!!
ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు విధి విధానాలు ప్రకటించింది. పథకం అర్హత పైన స్పష్టత ఇచ్చింది. ఈ స్కీం అమలు షెడ్యూల్ ను వెల్లడించింది. సూపర్ సిక్స్ లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలుకు ప్రభుత్వం ముహూర్తంగా ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి బుక్సింగ్స్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 31 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు కానుంది.
మార్గదర్శకాలు
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు పైన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనున్నారు. ఇప్పటికే ఆయిల్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఈ పథకం అబర్ 31 డెలివరీ రోజుగా పెట్టుకొని మొదటి సిలెండర్ మార్చి 31 వరకూ ఎప్పుడైనా పొందవచ్చని చెప్పారు. ఈ పథకం అమలు కావాలంటే ఎల్పీజీ కనెక్షన్ తో పాటుగా తెల్ల రేషన్ కార్డు ఉండాలని అలాగే ఆధార్ కార్డు తప్పనిసరి అని మంత్రి మనోహర్ స్పష్టం చేసారు.

48 గంటల్లో జమ
ఉచిత గ్యాస్ కోసం ఈ నెల 29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవు యని చెప్పారు. బుకింగ్ కన్ఫం కాగానే ఉచిత గ్యాస్ సిలెండర్ కోసం ఒకటి బుక్ అయ్యిందని ఎస్‌ఎమ్‌ఎస్ వెళుతందన్నారు. మూడు ఆయిల్ కంపెనీలతో జరిగిన చర్చను బట్టి 24 నుంచి 48 గంటల్లోపు డెలివరీలు పూర్తవుతాయన్నారు. గ్యాస్ సిలెండర్ అందించిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ అవుతుందన్నారు. రూ.894.92 కోట్లు ఆయిల్ కంపెనీలకు 29న అందిస్తామన్నారు. కేంద్రం ఎలా డీబీటీ ద్వారా ఇస్తుందో అలాగే తాము కూడా డీబీటీ ద్వారా పంపిణీ చేయాలని కోరారన్నారు.

అమలు షెడ్యూల్
వచ్చే సిలెండర్ నాటికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ నిధులు అందిస్తామని వెల్లడించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.2674 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం ద్వారా ఖర్చు అవుతుందని తెలిపారు. ఎవ్వరికైనా పథకం అందకపోతే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయ వచ్చని మనోహర్ పేర్కొన్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 లోపు గ్యాస్ సిలెండర్ పొందవచ్చన్నారు. రెండవ విడత సిలెండర్ కోసం ఏప్రిల్ 1 నుంచి జులై 30 వరకూ, మూడవ విడత సిలెండర్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 31, అదే విధంగా నాల్గవ విడత సిలెండర్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ పొందవచ్చని మంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications