వైసీపీ నాయకుల దెబ్బకే అలా జరిగిపోయింది, నాశనం అయ్యింది
గత వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు అనేక అక్రమాలకు గురి కావడం వలనే విజయవాడ వరద ముంపుకు గురైందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు బుడమేరును ఇష్టం వచ్చినట్లు ఆక్రమించినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే విజయవాడ అతలాకుతలం అయ్యిందని, వైసీపీతో రాష్ట్రం కూడా నాశనం అయ్యిందని మంత్రి నారాయణ ఆరోపించారు.
బుడమేరును ఇష్టం వచ్చినట్లు కబ్జా చేయడం వలనే విజయవాడ వరద ముంపుకు గురైందని మంత్రి నారాయణ ఆరోపించారు. శనివారం నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పారుతున్న కాలువలను మంత్రి నారాయణ పరిశీలించారు. ఇదే సందర్బంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆపరేషన్ బుడమేరును రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో కూడా పలు అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. 2015లో నెల్లూరులో వరదలు రావడంతో పలు ప్రాంతాలు మునిగిపోయాయని మంత్రి నారాయణ గుర్తు చేశారు. ప్రస్తుతం నెల్లూరు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెయ్యడం కోసం సమూలంగా మార్పులు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. బుడమేరు వాగు ఉప్పెనతో విజయవాడ నగరం అతలాకుతలం అయ్యిందని, లక్షలాదిమంది స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు.
అలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగానే నెల్లూరు నగరాన్ని సమూలంగా మార్పులు చేసి అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ ఆ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రత్యేక కమిటీతో నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారని, పది రోజుల్లో ఆ అధికారులు నివేదిక ఇస్తారని మంత్రి నారాయణ అన్నారు.

ఆ తర్వాత నెల్లూరు నగరంలోని కాలువలు అభివృద్ధి చేస్తామని, పలుచోట్ల మరమ్మత్తులు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. కాలువల పనులు జరిగే సమయంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూస్తామని, అందుకు తగ్గట్లుగా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు నెల్లూరు నగరం అభివృద్ధి కోసం ప్రజలు, నాయకులు పార్టీలకు అతీతంగా సహకరించాలని మంత్రి నారాయణ మనవి చేశారు.












Click it and Unblock the Notifications