అమరావతి పనులపై మంత్రి సీరియస్, "పనిచేయకుంటే వెళ్లిపోండి"
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యాన్ని ప్రభుత్వం ఇక ఎంతమాత్రం సహించే ప్రసక్తే లేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం నేలపాడు పరిధిలో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు, గ్రూప్-డి క్వార్టర్ల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల వేగంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, లక్ష్యాలను చేరుకోలేని నిర్మాణ సంస్థలపై నిప్పులు చెరిగారు. "పనిచేయలేకపోతే తప్పుకోండి.. అంతేకానీ కాలయాపన వద్దు" అంటూ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు ముఖం మీదే తేల్చి చెప్పారు.
క్షేత్రస్థాయిలో పనులు మందకొడిగా సాగడంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకమైన రాజధాని పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ షాపూర్ జీ పల్లోంజీ కన్‌స్ట్రక్షన్ సంస్థపై అసహనం వ్యక్తం చేశారు. లక్ష్యానికి అనుగుణంగా పనితీరు లేని సదరు సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను తక్షణమే పంపించేయాలని అధికారులను ఆదేశించడం సంచలనం సృష్టించింది. "ప్రభుత్వం గట్టిగా అడిగే రోజులు వచ్చాయి, నిర్దేశించిన గడువులోగా ఇటుక పడాల్సిందే" అని హెచ్చరించారు.

రాజధానిపై విమర్శలు అర్థరహితం
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, గత ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేశారు. రాజధానిపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ప్రజలు వారి నిరాధార మాటలను నమ్మే స్థితిలో లేరని అన్నారు. "గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడకుండా ఉండి ఉంటే, నేడు అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందేది" అని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను మళ్ళీ గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని తెలిపారు.
మూడేళ్లలో పరిపాలన నగరం..
ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ మంత్రి కీలక ప్రకటనలు చేశారు. ప్రస్తుతం 4,026 గృహాల నిర్మాణం వివిధ దశల్లో ఉందని, వాటిని త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే 3 నెలల్లో ప్రధాన రహదారుల పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వర్షాకాలం రాకముందే డ్రైనేజీ, భూగర్భ కేబుల్ పనులను పూర్తి చేసి, వర్షం పడినా నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో పూర్తిస్థాయి పరిపాలన భవనాలను అందుబాటులోకి తెచ్చి, పాలనను ఇక్కడి నుంచే పరుగులు తీయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
-
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications