వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ;ఇదే తొలిసారి:మంత్రి పరిటాల సునీత

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అనంతపురం:రాష్ట్రంలోనే తొలిసారిగా హిజ్రాలకు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత ఫించన్లు పంపిణీ చేశారు.అనంతపురంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం అర్హులైన హిజ్రాలకు ఫించన్ల పంపిణీ జరుగగా ఈ కార్యక్రమానికి మంత్రి సునీత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిజ్రాలు కూడా సమాజంలో ఒక భాగమేనన్నారు. ఆ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని వారిని మనతో సమానంగా ఆదరించాలన్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వం హిజ్రాలకు పించన్లు పంపిణీకీ శ్రీకారం చుట్టిందన్నారు. నెలకు 1500 రూపాయల చొప్పున అర్హులైన‌ ప్రతి ఒక్కరికి ఫించను అందించడం జరుగుతుందన్నారు. అర్హత నిర్థారణ కోసం హిజ్రాలు మెడికల్‌ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఫించనుకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Minister Paritala Sunitha distributes pensions to hijras

హిజ్రాల వెతల పై చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.హిజ్రాలు కూడా డ్వాక్రా సంఘాలకు ధీటుగా సంఘాలుగా ఏర్పడి బ్యాంకు లింకేజి ద్వారా రుణాలు పొందాలని ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఎపిలో హిజ్రాలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతోందన్నారు.

English summary
Minister Paritala Sunitha has said that the administration will provide minimum facilities to hijras . She distributed pension of Rs 1,500 to hijras at a programme held in the Velugu Office here on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X