ఆసక్తికరం: పదవులపై మంత్రుల టెన్షన్, బాబు మనసులో ఏముందో?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: మంత్రివర్గ పునర్వవ్యవస్తీకరణపై అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం నాడు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఎవరి పదవులు ఉంటాయో ఎవరి పదవులు ఊడుతాయోననే చర్చ సాగుతోంది.

ఏప్రిల్ రెండో తేదిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించాలని చంద్రబాబునాయుడు ముహుర్తం ఖరారు చేశారు. కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభించిన చోటే మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.

అయితే చంద్రబాబునాయుడు ఎవరిని తన మంత్రివర్గం నుండి తొలగిస్తారో, ఎవరికి కొత్తగా చోటు కల్పిస్తారో అనే విషయమై చర్చ సాగుతోంది.ఎవరికి పదవి గండం ఉంది. ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారనే విషయమై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర చర్చ సాగుతోంది.

minister pattipati pulla rao intresting comments on cabinet reshuffle

మంత్రి పదవిని కాపాడుకోవాలన్న టెన్షన్ కొందరిదైతే, పదవి వస్తోందో లేదోననే టెన్షన్ మరికొందరిది అంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనసులో ఏముందో తెలియదని డిప్యూటీ సిఎం కె.ఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
ap minister pattipati pulla rao interesting comments on cabinet reshuffle in assembly lobbies on friday.what is in chandrababu naidu's mind don't know said deputy cm k.E. krshna murthy .
Please Wait while comments are loading...