వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయవరం బాధితులకు మంత్రుల పరామర్శ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అక్రమంగా బాణాసంచా పేలుడు పదార్థాలను చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపి డిప్యూటీ సిఎం, హోంమంత్రి చిన రాజప్ప, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను మంత్రులు సోమవారం పరామర్శించారు. పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

మరణించిన వారిలో లింగంపల్లి శేషమ్మ, భూపతి సత్తిబాబు, నూతిన సత్యవతి, భూపతి లోవరాజు, కడారి దుర్గ, సమ్మంగి రమణ ఉన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన కసిరెడ్డి కృష్ణ, కసిరెడ్డి విశ్వనాథం, బంగారి అప్పారావు, సిలయశెట్టి లక్ష్మి, నానేపల్లి దుర్గ చికిత్సపొందుతున్నారు. కృష్ణ, దుర్గ, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

ఘటనలో మరణించిన వారి కుటుంబాలను హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పన ఎక్స్‌గ్రేషియా అందించారు. చినరాజప్ప మాట్లాడుతూ.. బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసి, ప్రమాణాలు పాటించని కేంద్రాలను మూసివేయిస్తామన్నారు.

సోమవారం మధ్యాహ్నం గోకులపాడులో బాణసంచా విస్ఫోటనం జరిగిన స్థలాన్ని స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలతో కలసి ఆయన పరిశీలించారు. బాధితులంతా నిరుపేదలైనందున మరింత ఆర్థిక సహాయం కోసం సిఎంని కోరుతామన్నారు. ఎంపి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే వి. అనిత, కలెక్టర్ ఎన్. యువరాజు, ఐజి కుమార్ బిస్వాస్, రూరల్ ఎస్పీ ప్రవీణ్, ఫైర్ ఆఫీసర్ జె. కేశవరావు, ఎఎస్పీ సత్యయేసుబాబు, ఆర్డీవో కె. సూర్యారావు, తహశీల్దార్ వివి రమణ ఉన్నారు.

పేలుడు ఘటనా స్థలం

పేలుడు ఘటనా స్థలం

జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఏపి డిప్యూటీ సిఎం, హోంమంత్రి చిన రాజప్ప, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సోమవారం పరామర్శించారు.

పేలుడు ఘటనా స్థలం

పేలుడు ఘటనా స్థలం

పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో లింగంపల్లి శేషమ్మ, భూపతి సత్తిబాబు, నూతిన సత్యవతి, భూపతి లోవరాజు, కడారి దుర్గ, సమ్మంగి రమణ ఉన్నారు.

ఘటనా స్థలంలో..

ఘటనా స్థలంలో..

కాగా, తీవ్రంగా గాయపడిన కసిరెడ్డి కృష్ణ, కసిరెడ్డి విశ్వనాథం, బంగారి అప్పారావు, సిలయశెట్టి లక్ష్మి, నానేపల్లి దుర్గ చికిత్సపొందుతున్నారు. కృష్ణ, దుర్గ, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

బాధితులనుద్దేశించి..

బాధితులనుద్దేశించి..

ఘటనలో మరణించిన వారి కుటుంబాలను హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పన ఎక్స్‌గ్రేషియా అందించారు.

బాధితులనుద్దేశించి..

బాధితులనుద్దేశించి..

చినరాజప్ప మాట్లాడుతూ.. బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసి, ప్రమాణాలు పాటించని కేంద్రాలను మూసివేయిస్తామన్నారు.

పరిహారం అందజేస్తూ..

పరిహారం అందజేస్తూ..

అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని బాణసంచా తయారీ కేంద్రాలపై ప్రజలు కూడా నిఘా ఉంచి, అధికారులకు ఫిర్యాదు చేయాలని, వాటిని వెంటనే మూయిస్తామని చెప్పారు.

పరిహారం అందజేస్తూ..

పరిహారం అందజేస్తూ..


విశాఖలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి రాజప్ప పరామర్శించారు. బాణసంచా ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక అందాక బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.

పరిహారం అందజేస్తూ..

పరిహారం అందజేస్తూ..

సోమవారం మధ్యాహ్నం గోకులపాడులో బాణసంచా విస్ఫోటనం జరిగిన స్థలాన్ని స్థానిక ఎంపి, ఎమ్మెల్యేలతో కలసి ఆయన పరిశీలించారు. బాధితులంతా నిరుపేదలైనందున మరింత ఆర్థిక సహాయం కోసం సిఎంని కోరుతామన్నారు.

English summary
Deputy Chief Minister and Home Minister of Andhra Pradesh Nimmakayala China Rajappa, who visited Gokulapadu village in Visakhapatnam district on Monday, where six persons died and five were severely injured in a blast at a cracker manufacturing unit that occurred on Sunday, said the government would strictly impose ban on employing children in cracker manufacturing units.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X