వైసీపీ ఆఫీసుకే వస్తా: అచ్చెన్న సవాల్, ‘జగన్ పాదయాత్ర ఎలా చేస్తావ్?'

Subscribe to Oneindia Telugu

అమరాతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమంపై చర్చించేందుకు తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తానని, అందుకు, జగన్ సిద్ధమేనా అంటూ ఆయన సవాల్ విసిరారు.

జగన్! పొర్లుదండాలు పెట్టినా లాభం లేదు: అచ్చెన్నాయుడు, 'పోలీసులు ఊరుకోరు'

YS Jagan tour in districts instead of Padayatra? పాదయాత్రపై జగన్ రివర్స్ గేర్ | Oneindia Telugu
 జగన్ లాభం లేదు...

జగన్ లాభం లేదు...

బీసీల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని ఆయన విమర్శించారు. జగన్ చేపట్టనున్న పాదయాత్రపై అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని పునరుద్ఘాటించారు.

 జగన్ నిందితుడని..

జగన్ నిందితుడని..

ప్రస్తుతం ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరని, కోర్టు కేసుల నుంచి జగన్ తప్పించుకోలేడని అన్నారు. పిల్లవాడి నుంచి చనిపోయే వ్యక్తి వరకూ జగన్ చరిత్ర ఏంటో తెలుసుని.. టీడీపీ ఎమ్మెల్యేగా ఈ విమర్శలు తానేమి చేయడం లేదని అన్నారు. పలు కేసుల్లో జగన్ నిందితుడని తాను చెప్పడం కాదని, సీబీఐ చార్జిషీట్లే అందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

 జగన్.. జైలుకు ఖాయం..

జగన్.. జైలుకు ఖాయం..

వచ్చే ఎన్నికల్లోపు జగన్ జైలుకెళ్ళడం ఖాయమని రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో పులివెందుల సహ 175 స్థానాలు తెలుగుదేశం పార్టీవేనన్నారు.

 పాదయాత్ర ఎలా చేస్తావు?

పాదయాత్ర ఎలా చేస్తావు?

అలాగే ఓ వైపు కేసులు, మరోవైపు పాదయాత్ర ఎలా సాధ్యమని మంత్రి ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో జగన్ పోల్చుకోవడం మూర్ఖత్వమన్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపితే ఎక్కడ జారిపోతారోనని జగన్‌కు భయం పట్టుకుందని ఆదినారాయణరెడ్డి అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh ministers Atchannaidu and Adi Narayana Reddy fired at YSRCP president YS Jaganmohan Reddy.
Please Wait while comments are loading...